Home /News /life-style /

DO YOU HAVE HAIR FALL PROBLEMS MOSTLY THEN YOU MUST KNOW FEW THINGS AND FOLLOW TIPS TO GET RID IT PRV

Hair problem tips: జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటోందా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జుట్టు రాలడం, జీవం లేని జుట్టు, జుట్టు చిట్లిపోవడం , పొడిబారి పోవడం, గిరజాల జుట్టు, అల్లిన జుట్టు, ఏ స్టైల్ కి వర్తించని వదులుగా ఉండే జుట్టు రకం ఇలా రకరకాలు ఉంటాయి. అయితే వీటికి కారణాలు ఏంటంటే..

    జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు (proteins) ఒక ముఖ్యమైన అంశం. హెయిర్ ఫోలికల్స్ తగినంత ప్రోటీన్ ను పొందలేని సమయంలో జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి . ఫలితంగా జుట్టు రాలడం (hair fall) మొదలవుతుంది. అలాగే మన శరీరంలో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా హార్మోన్ల అసమతుల్యత జుట్టు రాలడానికి కారణం అవుతుంది. మనం తీసుకొనే ఆహారంలో సరైన విటమిన్లు (Vitamins) ,ఖనిజాలు ,ప్రోటీన్లు లేకపోవడం వల్ల కూడా జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ఇవన్నీ కూడా జుట్టు బలహీనమడానికి కారణాలు (hair weak reasons) అవుతున్నాయి.

    జన్యువులు కీలకపాత్ర..

    జుట్టు బలహీనం (hair weak) అవ్వడానికి లక్షణాలు పరిశీలిస్తే అధిక జుట్టు రాలడం, జీవం లేని జుట్టు, జుట్టు చిట్లిపోవడం , పొడిబారి పోవడం, గిరజాల జుట్టు, అల్లిన జుట్టు, ఏ స్టైల్ కి వర్తించని వదులుగా ఉండే జుట్టు రకం ఇలా రకరకాలు. అయితే వీటన్నింటికి కారణాలు..  జుట్టు నాణ్యత (Hair quality), అలాగే బలాన్ని నిర్ణయించడంలో జన్యువులు కీలకపాత్ర పోషిస్తాయి.

    ఇక జుట్టు యొక్క అలంకరణ పై ఆధారపడి, మీకు అందమైన జుట్టు అలాగే మృదువైన జుట్టు (smooth hair) ఉండవచ్చు. ఒక్కొక్కసారి తల్లిదండ్రుల నుంచి కూడా సంక్రమిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని(hair health) ప్రభావితం చేసే కొన్ని సమస్యలు కూడా ఇలాంటి జున్ను అలంకరణ పై ఆధారపడి ఉంటాయి. జుట్టుకు ఎక్కువ వేడి తగిలించడం వల్ల కూడా జుట్టు దెబ్బతింటుంది. వేడి  జుట్టు కుదుళ్లు తాకినపుడు తల మీద ఉండే నూనెలు  బయటికి పోయి, చర్మం దెబ్బతింటుంది. అలాగే కుదుళ్ళు నష్టపోయి జుట్టుకు నష్టం కలుగుతుంది.

    అయితే ఇలాంటి సమస్యల నుంచి జుట్టును రక్షించడం సాధ్యం కాదు. ఇక అలాగే జుట్టుకు ఉపయోగించే హెయిర్ డైల కారణంగా కూడా జుట్టు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.  అంటే ఈ డై లో ఉపయోగించే రసాయనాల కారణంగా జుట్టు బలహీనంగా మారి, జుట్టు రాలడానికి దారితీస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair problem tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు