హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Coffee Drink: మీరు కాఫీ తాగుతున్నారా..? ఈ క్యాటగిరీ వాళ్లు అస్సలు తాగకూడదంటా.. మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి..!

Coffee Drink: మీరు కాఫీ తాగుతున్నారా..? ఈ క్యాటగిరీ వాళ్లు అస్సలు తాగకూడదంటా.. మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి..!

మీరు కాఫీ తాగుతున్నారా..? ఈ క్యాటగిరీ వాళ్లు అస్సలు తాగకూడదంటా..

మీరు కాఫీ తాగుతున్నారా..? ఈ క్యాటగిరీ వాళ్లు అస్సలు తాగకూడదంటా..

డైలీ కాఫీ (Coffee) తాగే వారిలో అల్జీమర్స్, టైప్-2 డయాబెటిస్ (Diabetic), గుండె సంబంధిత వ్యాధులు (Heart Problems) వచ్చే ముప్పు తగ్గుతుంది. అయితే ఈ పానీయాన్ని కొందరు మాత్రం అస్సలు తాగకూడదు. మరి వారు ఎవరు? వీరు ఎందుకు కాఫీ తాగకూడదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చాలామంది ప్రజలకు ఉదయాన్నే కాఫీ (Coffee) తాగే అలవాటు ఉంటుంది. కాఫీ తాగకపోతే వీరికి రోజు గడవదు. ఈ హాట్ డ్రింక్ రోజూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) చేకూరుతాయి. డైలీ కాఫీ తాగే వారిలో అల్జీమర్స్, టైప్-2 డయాబెటిస్ (Diabetic), గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. అయితే ఈ పానీయాన్ని కొందరు మాత్రం అస్సలు తాగకూడదు. మరి వారు ఎవరు? వీరు ఎందుకు కాఫీ తాగకూడదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* గర్భిణులు

గర్భవతులు లేదా తల్లిపాలు ఇస్తున్న వారు కాఫీకి దూరంగా ఉండటం శ్రేయస్కరం. గర్భస్రావం, అకాల ప్రసవం, తక్కువ బరువుతో పిల్లల పుట్టడం వంటి ముప్పులను నివారించడానికి గర్భవతులు కాఫీ తాగకపోవడమే మంచిది. ఒకవేళ కాఫీ తాగాలి అనుకున్నా 200 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ ఫలానా మోతాదులో తీసుకుంటే మంచిదని ఎవరు చెప్పలేరు కాబట్టి ప్రెగ్నెన్సీతో ఉన్నవారు కాఫీ తాగే ముందు ఒకసారి డాక్టర్‌ను కలవాలి. అలాగే పాలిచ్చే తల్లులు కాఫీ తాగడం వల్ల ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురి అయ్యే అవకాశం ఉంది. అందువల్ల వీరు కూడా పాలిచ్చే రోజుల్లో కాఫీని మానేయటం ఉత్తమం.

* మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు

మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలి. ఎందుకంటే కాఫీని అరిగించుకునే శక్తి వీరికి ఉండదు. కాఫీ తాగిన తర్వాత నిద్రపోలేకపోతే.. వారికి మెటబాలిజం స్లోగా ఉందని అర్థం. స్లో మెటబాలిజం ఉన్నవారు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాఫీని తాగ కూడదు. అలానే కాఫీని రోజుకు ఒకసారి కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్న వారు కూడా దీనికి దూరంగా ఉంటే మంచిది. లేదంటే డయేరియా సమస్యతో బాధపడక తప్పదు.

ఇదీ చదవండి: ఈ డ్రింక్ తాగితే మిమ్మల్ని మీరే గుర్తు పట్టలేరు.. బరువు తగ్గుతూ, ఇమ్యూనిటీ పెంచే సూపర్ ఫుడ్..!!


* ఆందోళన ఎక్కువ ఉన్నవారు

కెఫిన్ ఒక ఉత్తేజకరమైన పదార్థంగా పనిచేస్తుంది. ఈ స్వభావం వల్ల ఇది కొంతమంది వ్యక్తులలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తుంది. అందువల్ల, తరచుగా ఆందోళన లేదా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నవారు కెఫిన్ గల కాఫీ తాగడం మానేయాలి లేదా బాగా తగ్గించాలి. అన్ని కెఫిన్ పానీయాలను తాగడం తగ్గించి వాటికి బదులుగా డీ-కెఫిన్ (decaffeinated) చేసిన డ్రింక్స్ ఎంచుకోవడం మంచిది.

* ఖాళీ కడుపుతో కాఫీ వద్దు

ఖాళీ కడుపుతో కూడా కాఫీ తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ను తీసుకుంటే ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాఫీ అనేది కడుపులో యాసిడ్‌ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంది.

* ఎసిడిటీ సమస్య ఉన్నవారు

తీవ్ర ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారు కూడా కెఫిన్ లేని పానీయాలకు అలవాటు పడాలి. లేదా కాఫీ తాగే ముందే ఆహారం తినడానికి ప్రయత్నించాలి.

ఆరోగ్యంగా ఉన్న వారైనా సరే రోజుకు 400mg కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకూడదు. కాఫీ ఒక్కటనే కాదు కెఫిన్ ఉన్నవన్నీ కలిపి పైన చెప్పిన మోతాదు కంటే అధికంగా తీసుకోకూడదు. కేవలం కాఫీ మాత్రమే తాగేవారైతే సగటున 2 నుంచి 3 కప్పులు కంటే ఎక్కువ తీసుకోకూడదు. ప్రీ-వర్కౌట్ డ్రింక్‌గా బ్లాక్ కాఫీ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

First published:

Tags: Coffee, Diet, Health benifits, Health Tips

ఉత్తమ కథలు