Health tips: నిద్ర సరిగా లేకపోతే బరువు పెరుగుతారా? రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొంటే సమస్యలేం వస్తాయి?

ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. నిద్ర లేమి సమస్యలు బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందా? ఆ విషయం ఒకసారి తెలుసుకుందాం..

  • Share this:
    టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ బిజీబిజీ జీవితంలో హాయిగా నిద్రపోవడం (Sleeping ) అనేది ఎవరికైనా వరంలాంటిదే. కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు ఛిద్రమైపోయాయి. ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత (peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టని వారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి.  చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. నిద్ర లేమి సమస్యలు బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందా? ఆ విషయం ఒకసారి తెలుసుకుందాం..

    ఉబకాయులు జాగ్రత్త..

    సరైన నిద్ర (sleep) చాలామందికి దొరకడం లేదు అని చెప్పాలి. అయితే ప్రతి రోజూ వైద్యులు సూచించిన విధంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోకపోతే వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన నిద్ర లేకపోతే ఇక బరువు (weight) కూడా పెరుగుతారట. ఇప్పటికే ఉబకాయంతో ఉన్నవారు నిద్ర సరిగా పోకపోతే భవిష్యత్తులో ఇతర అనారోగ్య సమస్యలు (unhealthy problems) కూడా వచ్చే అవకాశం ఉందట. అందుకే నిద్ర అనేది తప్పనిసరి.

    గుండె సంబంధిత సమస్యలు..

    ఇక తగినంత నిద్ర లేకపోయినా, రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉన్నా ఉదయం ఏకాగ్రత తగ్గిపోతుందని అంతే కాకుండా భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు (heart problems) కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర సరిగా లేకపోవడంతో సెక్స్  సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    6 నుంచి 8 గంటల పాటు నిద్ర..

    ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రకు కేవలం కొంత సమయం మాత్రమే కేటాయిస్తూ ఉండడంతో ఇక ఎంతో మంది కొత్త కొత్త ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా ప్రతి రోజూ ప్రతి ఒక్కరు కూడా 6 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి అని వైద్య నిపుణులు (experts) సూచిస్తూ ఉంటారు. అలా నిద్ర పోయినప్పుడు మాత్రమే ఏకాగ్రతతో ప్రతి ఒక్కరు కూడా పని చేయడానికి అవకాశం ఉంటుందని లేదంటే ఏకాగ్రత కోల్పోవడమే (Concentration will loss)  కాదు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు (health issues) వచ్చే అవకాశం కూడా ఉంది అని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎవరూ నిద్ర (sleep) కోసం సరైన సమయాన్ని కేటాయించడం లేదు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published: