Home /News /life-style /

DO YOU FACING STOMACH PAIN PROBLEM REGULARLY THEN FOLLOW THIS SIMPLE TIPS TO GET RID OF THAT PAIN EASILY PRV

Stomach pain remedies: తిన్న తర్వాత కడుపులో నొప్పి, మంటగా ఉంటోందా? అయితే ఈ టిప్స్​ పాటించి.. నొప్పి దూరం చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు(problems) వస్తుంటాయి. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించి (Stomach pain home remedies) కడుపు నొప్పిని దూరం చేసుకోవచ్చు.

    కడుపు నొప్పి (Stomach pain). ఆహారంలో డయటరీ ఫైబర్ లేకపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, డీహైడ్రేషన్, పాలు ఇంకా పాల పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం, మెడిసిన్స్ వాడడం, అసలు ఎలాంటి ఎక్సర్సైజ్ లేకపోవడం, మల విసర్జన చేయవలసి వచ్చినప్పుడు ఆపుకోవడం, ఒత్తిడి వంటి కారణాల ద్వారా మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. ఈ సమస్యని ట్రీట్ చేయకపోతే అది క్రానిక్ కాన్స్టిపేషన్ గా మారుతుంది. అందు వల్ల గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడం, స్టమక్ బ్లోట్ అవ్వడం, కడుపు నొప్పి వస్తాయి.  ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు(problems) వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి(stomach pain) కారణం అవ్వవచ్చు. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించి (Stomach pain remedies) కడుపు నొప్పిని దూరం చేసుకోవచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం..

    పచ్చిమిర్చి, మసాలా (masala) దినుసులు తినడం వలన చాలా మందిలో ఎసిడిటి (acidity) సమస్య ఏర్పడుతుంది. దీంతో తమకు ఇష్టమైన ఆహారం (food) తీసుకోవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అలాగే ఈ సమస్యల నుంచి బయటపడేందుకు అనేక రకాల సప్లిమేంట్స్ ఉపయోగిస్తుంటారు. ఇక మరికొందరిలో ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో మంట (stomach problem), నొప్పి వంటి సమస్యలు కలుగుతుంటాయి. ఈ సమస్యలను మీ వంటగదిలో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.

    సమస్య రెగ్యులర్‏గా ఉన్నవాళ్లు..



    ఆహారం తిన్న తర్వాత కడుపులో మంట (pain in stomach), నొప్పి వంటి సమస్యలు ఏర్పడితే వెంటనే కొద్ది మొత్తంలో బెల్లం తినడం మంచిది. ఇది ఆహారాన్ని జీర్ణం (digest) చేసే ఎంజైములను విడుదల చేస్తాయి. అలాగే కడుపులో మంట సమస్య తగ్గుతుంది.  తిన్న తర్వాత కడుపులో మంట, నొప్పి (pain) వంటి సమస్యలు రెగ్యులర్‏గా ఉన్నవాళ్లు.. ఎక్కువగా అలోవేరా జ్యూస్ తీసుకోవడం ఉత్తమం. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అలేగ పేగులో నీటి శాతానని పెంచుతుంది. కడుపు నొప్పి (stomach pain) సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి ఈ జ్యూస్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది. అయితే తక్కువ మోతాదులో ఈ అలోవేరా జ్యూస్ తీసుకోవాలి.

    ఆహారం తిన్న  (After eating) వెంటనే అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. వెంటనే సోంపు నీరు తాగాలి. ఇందుకోసం ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ సోంపు కలపి రాత్రంతా వదిలెయ్యాలి. ఉదయాన్నే వడకట్టి.. ఆ నీటిని వేడిచేసి తీసుకోవాలి. ఒకవేళ రుచి (taste)ని పెంచుకోవడానికి మీరు ఒక టీస్పూన్ తేనె కలుపుకోవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health care, Stomach Pain

    తదుపరి వార్తలు