Home /News /life-style /

DO YOU FACING STOMACH PAIN AFTER ATE AND FOOD NOT DIGESTED PROPERLY THEN FOLLOW THESE METHODS TO GET RID OF IT PRV

stomach pain: తిన్న తర్వాత కడుపు నొప్పిగా ఉంటుందా? ఆహారం జీర్ణం అవట్లేదా.. అయితే ఈ చిన్న చిట్కాలు పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు(problems) వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి(stomach pain) కారణం అవ్వవచ్చు.

    ఆధునిక యుగంలో కల్తీ రాజ్యం నడుస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన వారు ప్రతీ దాంట్లోనూ కల్తీలు, నకిలీలు పుట్టిస్తున్నారు. ఆఖరికి మనం తినే ఆహారం (food)లోనూ ఇది మామూలైపోయింది. అయితే కల్తీ ఆహారం (food) తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి (Stomach pain) తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు (problems) వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి (stomach pain) కారణం అవ్వవచ్చు.

    చలికాలంలో కడుపు నొప్పి (Abdominal pain), అజీర్ణం సమస్యలు ఎక్కువే. ఉష్ణోగ్రతలు పడిపోవడం (Temperature down).. శరీరం చలికి గురవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గడంతోపాటు (Immunity power down).. అలసట, నీరసం కలుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ (digestive system) పై ప్రభావం చూపుతుంది. ఈ సీజన్లో కడుపులో హఠాత్తుగా నొప్పి వచ్చినా.. లేదా ప్రతిసారి తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న కొన్ని ఇంటి నివారణ పద్ధతులను (health tips) అనుసరించండి.

    పనిభారం.. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన గ్యాస్, అల్సర్, కడపునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే పచ్చిమిర్చి, మసాలా దినుసులు తినడం వలన చాలా మందిలో ఎసిడిటి సమస్య ఏర్పడుతుంది. దీంతో తమకు ఇష్టమైన ఆహారం తీసుకోవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఈ సమస్యలను మీ వంటగదిలో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందామా.

    ఆహారం తిన్న వెంటనే అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. వెంటనే సోంపు నీరు తాగాలి. ఇందుకోసం ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ సోంపు (Anise) కలిపి రాత్రంతా వదిలెయ్యాలి. ఉదయాన్నే వడకట్టి.. ఆ నీటిని వేడిచేసి తీసుకోవాలి. ఒకవేళ రుచిని పెంచుకోవడానికి మీరు ఒక టీస్పూన్ తేనె (honey) కలుపుకోవచ్చు.. ఆహారం తిన్న తర్వాత కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు ఏర్పడితే వెంటనే కొద్ది మొత్తంలో బెల్లం (Jaggery) తినడం మంచిది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైములను విడుదల చేస్తాయి. అలాగే కడుపులో మంట సమస్య తగ్గుతుంది.

    అలోవేరా జ్యూస్ తీసుకోవడం ఉత్తమం..

    తిన్న తర్వాత కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు రెగ్యులర్‏గా ఉన్నవాళ్లు.. ఎక్కువగా అలోవేరా జ్యూస్ (Aloe vera juice) తీసుకోవడం ఉత్తమం. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అలేగ పేగులో నీటి శాతానని పెంచుతుంది. కడుపు నొప్పి సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి ఈ జ్యూస్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది. అయితే తక్కువ మోతాదులో ఈ అలోవేరా జ్యూస్ తీసుకోవాలి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health Tips, Stomach Pain

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు