Home /News /life-style /

DO YOU FACING SLEEP PROBLEMS AT NIGHT TIME THEN FOLLOW THIS SIMPLE TIPS TO GET RID OF THAT ISSUES PRV

Sleeping: మీకు నైట్​ టైం తొందరగా నిద్ర పట్టడం లేదా? అయితే ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామందికి తొందరగా నిద్ర రాదు. ఎప్పుడో అర్ధరాత్రో అపరాత్రో నిద్ర పడుతుంది. కొందరికి అది కూడా పట్టదు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

    ఈ బిజీబిజీ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం (Sleeping ) అనేది ఒక వరంలాంటిదే. కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత(peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టని వారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. అయితే హాయిగా నిద్ర పోవాలంటే కొన్ని పద్దతులు (Sleep tips) రోజూ పాటిస్తే నిద్ర దానంతట అదే వస్తుందట.

    మనిషికి రోజుకు 7-8 గంటల సేపు రాత్రి నిద్ర (sleep) అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. కొంతమంది పనిలో పడి నిద్రను త్యాగం చేస్తుంటారు. నిద్రాహారాలు మానేసి చేస్తున్నామని చెబుతుంటారు. ఇలా ఎన్నడూ చేయకూడదు. అయితే చాలామందికి వివిధ కారణాలతో రాత్రిళ్లు త్వరగా నిద్రపట్టదు. బెడ్‌పై గంటల కొద్దీ దొర్లుతూనే ఉంటారు కానీ నిద్రపోలేరు. కళ్లు మూసుకున్నా ఏదో ఆలోచనలు వెంటాడుతూ నిద్ర రావడం లేదని లేచిపోతుంటారు. ఎప్పుడో అర్ధరాత్రో అపరాత్రో నిద్ర పడుతుంది. కొందరికి అది కూడా పట్టదు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఇలా నిద్రపట్టక (Insomnia) బాధపడేవారు ఈ టిప్స్ (sleep tips) పాటిస్తే వెంటనే నిద్రపడుతుంది. అవేంటో చూడండి.



    గసగసాల్ని దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించి వాసన పీలుస్తూ (smell) ఉండాలి. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తల వెంట్రుకల్ని మృదువుగా దువ్వుతూ లేదా చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేసినా నిద్ర పడుతుంది. రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె (Coconut oil)తో మర్దనా చేసుకున్నా మంచి నిద్ర పడుతుంది. అలా కాదనుకుంటే రాత్రి పూట గోరు వెచ్చని పాలు (Milk)..మిరియాల పౌడర్ కలుపుకుని తాగాలి.

    మరో పద్ధతి కూడా ఉంది.. రాత్రి పడుకునే ముందు ఆవు నెయ్యి (Cow ghee) గోరు వెచ్చగా చేసుకుని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా నిద్ర పట్టే అవకాశాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Sleep tips

    తదుపరి వార్తలు