Home /News /life-style /

DO YOU FACING SLEEP PROBLEMS AT NIGHT THEN DO THIS THINGS BEFORE BATH AND FOLLOW THIS SIMPLE TIPS PRV

Best sleeping tips: ప్రశాంతంగా నిద్రపట్టడం లేదా? అయితే స్నానం చేసే ముందు ఇలా చేయండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే వారు ఖచ్చితంగా స్నానం చెయ్యాలట. అయితే స్నానం చెయ్యడంలో కూడా ఓ పద్దతి ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.

    ప్రశాంతంగా నిద్రపోవడం (Sleeping) అనేది ఒక వరంలాంటిదే. కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. ప్రశాంతత (peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి.

    చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure) కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. చాలా మంది కూడా ఎంత కష్టపడి పని చేసి నిద్రకు ఉపక్రమిస్తారు. కానీ, వారికి నిద్ర సరిగ్గా పట్టదు. ఇక ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే వారు ఖచ్చితంగా స్నానం చెయ్యాలట. అయితే స్నానం చెయ్యడంలో కూడా ఓ పద్దతి ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.. ఇక స్నానం చేసే ముందు శరీరానికి నువ్వుల నూనె (Sesame oil),  ఆవాలు నూనె (mustard oil) వెన్న (butter) ఇలా ఏదో ఒక నూనెతో మసాజ్ (massage) చేసుకోవడం చాలా మంచిదట. ఇక ఇలా శరీరానికి అప్లై (apply to body) చేసుకునే నూనె (oil)ను కొంచెం వేడిగా చేసుకుంటే శరీరం అనేది మంచి రిలాక్స్​ను పొందుతుందని ఆయుర్వేదం (Ayurveda) చెబుతోంది. ఇది నిద్రకు ఎంతో ఉపయోగపడుతుందట.

    స్నానం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

    ఇలా స్నానం చేస్తే శరీరానికి మంచి మెరుపు , మృదుత్వం కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరాన్ని కూడా బాగా దృఢం చేస్తుందట. ఇంకా శరీరానికి అలసట పోగొట్టి మంచి సుఖ నిద్ర (good sleep)ని కూడా ఇస్తుంది. ఇక అరికాళ్ళు ఇంకా చేతుల మంటలతో పాటు..  తల నొప్పి (headache)ని కూడా వెంటనే నివారిస్తుంది. ఈ స్నానం వల్ల ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు (health benefits) కలుగుతాయి. అందుకే ఇప్పటికీ కూడా పెద్దవారు చిన్న పిల్లలకు స్నానానికి ముందు నూనె (oil) రాసి చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే.

    ఇక రోజూ కనుక ఇలా నూనె (Oil)తో మసాజ్ చేసుకుని స్నానం చేయడం (doing bath) కుదరకపోతే కనీసం వారంలో మూడు సార్లు ఇలా చేసినా కాని ఫలితాలు (good results) కలుగుతాయి. ఈ స్నానం రక్త ప్రసరణను పెంచుతుంది. శరీరంపై ఉన్న చెడు వాసన కూడా పోగొడుతుంది. ఇలా స్నానం చేస్తే వృద్దాప్యం ఛాయలను కూడా వెంటనే నివారిస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు