చర్మ సంరక్షణపై (Skin care )సరైన దృష్టి పెట్టనప్పుడు చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. స్కిన్ కేర్ విషయంలో సరైన పద్ధతులు పాటించకపోతే మొటిమలు, నల్ల మచ్చలతో పాటు ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మొటిమలు పురుషులు, మహిళలు అనే తేడాలు లేకుండా అందరినీ వేధిస్తాయి. సాధారణంగా ప్రతి ఒక్కరూ కౌమారదశలో మొటిమల సమస్యను ఎదుర్కొంటారు. అయితే చర్మ సంరక్షణలో చేసే తప్పులు, ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల లోపం.. వల్ల పెద్దవాళ్లు కూడా వీటి బారిన పడతారు. ఈ సమస్య నుంచి బయటపడే మార్గాలను వివరిస్తున్నారు డెర్మటాలజిస్టులు. ముందు సమస్యకు కారణాలు తెలుసుకున్న తరువాత, నివారణ పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. ముఖంపై నల్ల మచ్చలను (dark spots) తొలగించడానికి అనేక చిట్కాలు (Summer Skin care tips) ఉన్నాయి. స్కిన్ లోషన్లు, క్రీముల వాడకం కంటే ఈ చిట్కాలు మెరుగ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా మీ చర్మ సంరక్షణకు రెండు, మూడు గంటలకు మించి ఎండలో ఉండకుండా చూసుకోండి.
ఎలా దూరం చేసుకోవచ్చు..?
మొటిమలను నివారించే ప్రధాన మార్గం.. మెరుగైన చర్మ సంరక్షణ పద్ధతులు పాటించడమేనని చెబుతున్నారు చర్మవ్యాధుల నిపుణులు. సాలిసిలిక్ యాసిడ్ ఉండే ఫేస్ వాష్‌తో ముఖాన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు కడగాలి. తరువాత మాయిశ్చరైజ్ అప్లై చేయాలి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారు సైతం మాయిశ్చరైజర్లు వాడాలి. లేదంటే చర్మం మరీ పొడిబారినప్పుడు.. శరీర గ్రంథులు ఎక్కువ నూనెలను ఉత్పత్తి చేస్తాయి. ముఖానికి వేసుకునే మేకప్‌ను పూర్తిగా తొలగించాలి. పరిశుభ్రంగా లేని వస్తువులను మేకప్ కోసం వాడితే మొటిమల సమస్య మరింత పెరుగుతుంది.
తేనె (Honey) కారణంగా చర్మంపై తేమ కలుగుతుంది. అలాగే చర్మ కణాలు ఉత్పత్తి అవుతాయి. దీనికోసం మీరు కొద్దిగా తేనె తీసుకుని అందులో 2-3కుంకుమ పువ్వులను కలపండి. ఆ తర్వాత మెడ భాగం నుండి ముఖం వరకు బాగా మర్దన చేయాలి. 15-20నిమిషాలు అలాగే ఉంచాక నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతీరోజూ చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. దీన్ని తయారు చేసుకోవాలంటే.. 2టేబుల్ స్పూన్ల పెరుగు (Curd)ను తీసుకుని కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె, పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి మర్దన చేయాలి. 15నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
పెరుగు (curd)లో విటమిన్లు, ఖనిజాలు, ఎంజైములు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడంలో సాయపడతాయి. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం కారణంగా చనిపోయిన చర్మ కణాలు తొలగిపోయి కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ముడుతలను, గీతలను తగ్గించడంలో పెరుగు చాలా ఉపయోగపడుతుంది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.