శీతాకాలం మొదలైపోయింది. ఈ కాలంలో జలుబు, దగ్గు వంటి జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు చలికాలంలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలూ వేధిస్తుంటాయి. చలికాలం మొదలు కాగానే తేమ ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల తలమీది చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మనిషి అందాన్ని వారి కేశాల (hair)ను బట్టి కూడా అంచనా వేస్తున్నారు. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (fall) జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (black hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు (health issues) వలన జుట్టు రాలే (hair fall) సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన జుట్టు రాలిపోవడం, తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది.
పౌష్టికాహారం తప్పనిసరి..
చుండ్రు (dandruff), జుట్టు రాలిపోవడం (hair loss), జుట్టు బలహీనంగా ఉండటం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే, దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కాలుష్యం ఒక కారణం అయితే.. పౌష్టికాహార లోపం (Malnutrition) మరో కీలక కారణం. జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే.. మీరు తినే ఫుడ్‌లో పౌష్టికాహారం తప్పనిసరిగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా, మంచి పద్దతుల ద్వారా (hair loss treatment) జుట్టు రాలడం, జుట్టు పాలిపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జుట్టు బలంగా, రాలిపోకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు కీలకం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పొద్దుతిరుగుడు విత్తనాలలో..
సాల్మన్ చేప (Saalman fish) జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మంచి పోషకాలు అందిస్తుంది. క్రమం తప్పకుండా సాల్మన్ తింటే జుట్టు రాలడం తగ్గుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో (Sunflower seeds) విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని ప్రవాహా సక్రమంగా జరిగేలా చూస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు.. జుట్టు పొడవుగా, సిల్కీగా ఉండటానికి సహాయపడుతాయి.
పాలకూరలో(Lettuce) అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మీ రెగ్యులర్ డైట్‌లో పాలకూర తింటే.. మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలకూరలో విటమిన్ సి, ఫోలేట్, ఐరన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.సాల్మన్ చేపలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. చిలగడదుంపలలో బీటా కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్ మూలకం ఉంటుంది. ఇది సెబమ్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరం ఆరోగ్యంగా ఉంచటంతో పాటు.. జుట్టుకు కూడా మేలు చేస్తుంది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.