Home /News /life-style /

DO YOU FACING HEADACHE PAIN PROBLEM IN REGULAR BASIS THEN FOLLOW THIS SIMPLE AND EASY METHODS GET RID OF THAT PAIN PRV

Headache Treatment: తలనొప్పి మాటిమాటికీ వస్తోందా? నొప్పి భరించలేక పోతున్నారా? అయితే ఈ చిట్కాలు వాడండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తలనొప్పి (headache)కి గల కారణం తెలియక పోవచ్చు. కానీ, తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా.. వస్తూ పోతున్నట్లుగా.. తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది.

    తలనొప్పి (headache)కి గల కారణం తెలియక పోవచ్చు. కానీ, తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా.. వస్తూ పోతున్నట్లుగా.. తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు (Sounds) వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం (food) ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా.. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఈ రకం తలనొప్పి (headache) రావచ్చు. కొన్ని కుటుంబాలలో వంశపారపర్యంగా కూడా తలనొప్పి వస్తుంది. మరో వాదనలో తలలోని రక్తనాళాల్లో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడటం వలన వస్తున్నట్లు వాదన. ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి (stress), టెన్షన్ (tension), నిద్రలేమి (sleeping problems), జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. తలనొప్పికి కారణాలేవైనా వాటి నివారణకు సత్వర చికిత్స (Treatment) చేయించుకోవాలి. లేకుంటే కొన్ని రకాల తలనొప్పులు రోగికి ప్రాణాంతకంగా (dangerous) కూడా పరిణమించే ప్రమాదముంది. అయితే నొప్పి తగ్గడానికి కొన్ని చక్కటి పరిష్కారాలు (Headache Treatment) ఉన్నాయి.

    తలనొప్పి చిరాకు తెప్పిస్తుందనుకుంటే కాసేపు అన్ని పనులను పక్కన పెట్టేసి రిలాక్స్ (relax) అవ్వడం మేలు. దీనివల్ల అలసట తగ్గి తలనొప్పి ఎగిరిపోతుంది. ఒక్కోసారి మనం తీసుకునే ఆహారం (food) కూడా మన తలనొప్పికి కారణమవ్వచ్చు. కాబట్టి మీ ఆహార పద్ధతులను (Food habits) మార్చేటప్పుడు కొంత జాగ్రత్తగా (taking care) ఉండటం మంచిది. ఒక్కోసారి విపరీతమైన తలనొప్పికి డీ హైడ్రేషన్ కూడా కారణమవ్వచ్చు. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్ళు తాగండి. అంతే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.

    తలనొప్పి తగ్గడానికి క్యారెట్, కీరా జ్యూస్ (Carrot, Keera Juice) కూడా బాగా ఉపయోగపడుతుంది వెంటనే ఉపశమనాన్ని కూడా ఇది ఇస్తుంది. తలనొప్పి ఎక్కువగా ఉంటే లెమన్ జ్యూస్ ను కూడా మీరు తీసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు వేసుకుని తీసుకుంటే వెంటనే తల నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అలానే మైగ్రేన్ సమస్య నుండి కూడా బయటపడవచ్చు. తల నొప్పిని తగ్గించడానికి అరటిపండు, పైనాపిల్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. టెన్షన్ కారణంగా వచ్చిన తలనొప్పి చిటికలో మాయం అయిపోతుంది. మీరు అరటిపండుని పైనాపిల్ ను తీసుకుని మిక్సీలో బ్లెండ్ చేసి పాలు, నట్స్, పంచదార యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health Tips

    తదుపరి వార్తలు