Home /News /life-style /

DO YOU FACING HAIR PROBLEMS REGULARLY THEN JUST FOLLOW THIS HOME MADE TIPS FOR BETTER AND STRONG HAIR PRV

hair problem tips: మీ జుట్టు తొందరగా రాలిపోతుందా? అయితే బలమైన, అందమైన జుట్టు కోసం ఈ చిట్కాలు ప్రయత్నించండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

చాలామందికి చిన్న వయసులోనే జుట్టు రాలిపోతుంటుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ (products) కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (hair loss treatment) మంచి ఫలితాలను ఇస్తాయి.

    ఆకర్షణీయమైన పొడవాటి జుట్టు మీ అందాన్ని రెట్టింపు(Double) చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు (food habits), జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (fall) జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair loss) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (black hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు (health issues) వలన జుట్టు రాలే (hair fall) సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి (stress), మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు (white hair) చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ (products) కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (hair problem tips) మంచి ఫలితాలను ఇస్తాయి.

    పాలు, తేనె (Milk and Honey).. ఈ రెండూ మన అందాన్ని కాపాడుకునేందుకు ఎంతో అవసరం. ఈ రెండూ కలిస్తే.. అందాన్ని (beauty) రెట్టింపు చేయడం ఖాయం. ఈ రెండింటినీ మిక్స్ చేసి తయారుచేసిన హెయిర్ మాస్క్ జుట్టు (hair)లో తేమను పెంచుతుంది. ఇది వేసుకోవడం కూడా చాలా సులభం. ఎలాగంటే..

    ఒక బౌల్‌లో రెండు కప్పుల పాలు, మరో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకోవాలి.ఈ రెండింటినీ స్పూన్ సాయంతో బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత మీ జుట్టును నీటితో తడిపేసి.. ఈ మిశ్రమాన్ని (Mixer) మీ జుట్టు కుదుళ్ల నుంచి అంచుల వరకూ బాగా అప్లై చేసుకోవాలి. మాస్క్ (mask) వేసుకున్న తర్వాత పావు గంట పాటు అలా ఉంచుకోవాలి.తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక సారి.. రెండు నెలల పాటు చేయడం వల్ల జుట్టు (hair)లో తేమ పెరిగి పొడిబారకుండా, రాలిపోకుండా ఉంటుంది.

    అవకాడోల్లో ఎన్నో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ (healthy fats) ఉంటాయట. వీటిని తీసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే వీటిని మోతాదులో మాత్రమే తీసుకోవాలి. కేవలం అవకాడో తినడం, చర్మానికి (skin) రాసుకోవడం మాత్రమే కాదు.. ఒకవేళ మీకు డల్ హెయిర్ (Dull hair) ఉన్నా.. మీ జుట్టు చిక్కులు పడుతూ ఉన్నా దీన్ని ప్రయత్నించడంలో ఏమాత్రం తప్పు లేదు.

    ముందుగా అవకాడోను గుజ్జుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో దానిని రెండు స్కూప్స్ తీసుకోవాలి. ఈ మిశ్రమంలోనే ఒక అరటి పండు (banana)ను గుజ్జుగా చేసి వేయాలి. అలాగే టీ స్పూన్ పెరుగు (curd) కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేళ్లతో ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. దీన్ని 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచుకోవాలి. మిశ్రమం పొడిబారిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair fall, Hair problem tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు