Home /News /life-style /

DO YOU FACING HAIR PROBLEM REGULARLY THEN YOU NEED E VITAMIN FOR HEALTHY HAIR CLICK HERE TO KNOW MORE PRV

hair fall Treatment: జుట్టు రాలడం ఎక్కువగా ఉందా? అయితే మీ జుట్టుకి ఈ విటమిన్​ తప్పక కావాల్సిందే.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్యకరమైన జుట్టుకు ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (hair fall treatment) మంచి ఫలితాలను ఇస్తాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే మీ కురులకు తప్పకుండా విటమిన్​ ఈ అంది తీరాలట. దాని వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
    శీతాకాలం (winter) మొదలైపోయింది. ఈ కాలంలో జలుబు, దగ్గు వంటి జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు చలికాలంలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలూ వేధిస్తుంటాయి. చలికాలం మొదలు కాగానే తేమ ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల తలమీది చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మనిషి అందాన్ని వారి కేశాల (hair)ను బట్టి కూడా అంచనా వేస్తున్నారు. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (black hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు (health issues) వలన జుట్టు రాలే (hair fall) సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన జుట్టు రాలిపోవడం (Hair fall), తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (hair fall treatment) మంచి ఫలితాలను ఇస్తాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన జుట్టు (healthy hair) కావాలంటే మీ కురులకు తప్పకుండా విటమిన్​ ఈ అంది తీరాలట. దాని వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

    బాదం నూనె, గుడ్డు..

    ముందుగా గుడ్డు (Egg) పగలగొట్టి ఒక గిన్నెలో పోయండి. 4 విటమిన్ ఈ (Vitamin E) క్యాప్సూల్స్ నుంచి నూనెను తీసి గుడ్డు మిశ్రమంలో కలపండి. అలాగే 2 టీస్పూన్ల బాదం నూనె వేయండి. దీన్ని జుట్టు మొత్తానికి అప్లై చేయండి. ఒక గంట పాటు వదిలివేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. దీన్ని వారానికి 1 నుంచి 2 సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మరో పద్దతి (hair fall treatment)లో.. పండిన అవోకాడోను సగానికి కట్ చేయండి. గింజలు తీసివేసి మెత్తగా చేయండి. అందులో ఒక టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ (Vitamin E oil) మిక్స్ చేసి దానిని జుట్టుకు, తలకు పట్టించి గంటసేపు ఆరనివ్వండి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు మెరుస్తుంది.

    రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ (Aloe vera gel) తీసుకుని దానికి 2 టీస్పూన్ల విటమిన్ ఈ ఆయిల్ కలపండి. దీన్ని కలిపి మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టు అంతటా అప్లై చేసి కాసేపు వేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి. హెయిర్ మాస్క్‌ (Hair mask)ను 30-40 నిమిషాలు అలాగే ఉంచి ఆపై తేలికపాటి షాంపూతో కడగాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair fall, Hair problem tips

    తదుపరి వార్తలు