Home /News /life-style /

DO YOU FACING HAIR LOSS PROBLEMS THESE FOLLOW THIS HOME TIPS FOR STRONG HAIR PRV

hair loss treatment : మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? అయితే బలమైన, అందమైన జుట్టు కోసం ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (beauty tips) మంచి ఫలితాలను ఇస్తాయి.

మనిషి అందాన్ని వారి కేశాల (hair)ను బట్టి కూడా అంచనా వేస్తున్నారు. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు (food habits), జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం(fall) జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair loss) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (black hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు (health issues) వలన జుట్టు రాలే (hair fall) సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి (stress), మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు (white hair) చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ (products) కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (hair loss treatment) మంచి ఫలితాలను ఇస్తాయి.

జుట్టు తడిగా ఉన్నప్పుడు..

జుట్టు తడిగా ఉన్నప్పుడు జడ లేదా ముడి అస్సలు వేసుకోకండి. ఎందుకంటే దీని వల్ల జుట్టు పాడవడమే కాకుండా దుర్వాసన కూడా బాగా వస్తుంది.ఇక ఒకవేళ మీ జట్టు తడిస్తే, టవల్‌తో రుద్ది రుద్ది అస్సలు తుడవకండి. ఇలా చేయడం వల్ల జుట్టు బాగా రాలిపోతుంది.

ఇక దీనికి బదులుగా టవల్‌ (towel)ను మీ జుట్టకు చక్కగా చుట్టిపెట్టండి. నీరు మొత్తం పోయే వరకూ టవల్‌తో బాగా పిండండి. ఇక జుట్టు రాలిపోవడానికి (hair fall) తడి జుట్టు కూడా ఒక కారణం కావచ్చు. అందుకే అసలు జుట్టు పూర్తిగా ఆరిపోయేవరకు దువ్వెన అసలు వాడకండి. ఇక జుట్టును ఆరోగ్యంగా ఇంకా బలంగా ఉంచేవి ప్రోటీన్లు. మనకు ప్రోటీన్లు తగ్గిన కొద్దీ జుట్టు అనేది బాగా పలచబడిపోతుంది. ఇక అందుకు ప్రోటీన్లు సమృద్దిగా ఉండే పాలకూర, క్యాలీఫ్లవర్,కీరా, క్యాప్సికం ఇంకా టమాటా (tomato) వంటి కూరగాయలని రోజు ఖచ్చితంగా తీసుకునే ఆహారం (food)లో ఉండేలా చూసుకోవాలి.

అమినో యాసిడ్స్ కూడా..

ఇక అలాగే సల్ఫర్ అమినో యాసిడ్స్ కూడా జుట్టు (hair) ఒత్తుగా ఉండేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. అలాగే సోయాబీన్స్ , రాగి, బీట్రూట్, నువ్వులు, అరటి, ఖర్జూరం, ద్రాక్షా ఇంకా కోడిగుడ్డుల (eggs) నుంచి ఈ సల్ఫర్ అమినో ఆమ్లాలు అనేవి పుష్కలంగా దొరుకుతాయి.కాబట్టి ఈ పద్ధతులు (hair loss treatment) పాటించండి. జుట్టుని ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోండి.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి:  మీ మోకాళ్ల అందం తగ్గిపోతుందా? నల్లగా మారుతున్నాయా? అయితే ఇలా చేసి సమస్య దూరం చేసుకోండి

 చర్మంలో మెరుపు తగ్గిపోయిందా? ఆవిరితో మీ చర్మం కాంతివంతంగా మార్చుకోవచ్చు.. ఇలా చేయండి
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Beauty tips, Hair fall, Hair Loss

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు