Home /News /life-style /

DO YOU FACING HAIR LOSS PROBLEMS THEN FOLLOW THESE TIPS FOR STRONG AND HEALTHY HAIRS PRV

hair fall treatment: మీ జుట్టు ఎక్కువగా రాలితే మాత్రం ఈ చిట్కాలు పాటించి జుట్టును ధృడంగా, నిగనిగలాడేలా చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొంతమందికి జుట్టు రాలడం చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (beauty tips) మంచి ఫలితాలను ఇస్తాయి.

మనిషి అందాన్ని వారి కేశాల (hair)ను బట్టి కూడా అంచనా వేస్తున్నారు. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం( hair loss) జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (black hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు (health issues) వలన జుట్టు రాలే (hair fall) సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు రావడం, జుట్టు రాలడం (hair fall) చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (hair fall treatment) మంచి ఫలితాలను ఇస్తాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం..

అర కప్పు వేయించిన దాల్చిన చెక్క (Cinnamon) పొడి తీసుకోని అందులో అర కప్పు క్యారియల్ ఆయిల్ కానీ, కండిషనర్ కానీ కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తడి జుట్టు (hair) కి అప్లై చేయండి.ఒక గంట అలాగే వదిలేసి ఆ తరువాత కడిగేయండి. ఇలా రోజు చేస్తే జుట్టు (hair) నిగ నిగ లాడుతుంది. అలాగే రెండు కప్పుల నీరు తీసుకోని ఆ నీటిలో అర కప్పు చామోమిల్ టీ ఆకులు వేసి మరిగించి ఒక గంట మూత పెట్టి అలా వదిలేయండి. ఇక ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత మీ జుట్టునంత ఒక సారి తడపండి. ఇప్పుడు ఈ తడి జుట్టు మీద ఈ టీని కనీసం పది సార్లు పోయండి. ఆ తరువాత చల్లని నీటితో జుట్టుని వాష్ చెయ్యండి.

ఒక కప్పు నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల ప్యూర్ హెన్నా పౌడర్ (henna powder) ని కలిపి ఎనిమిది గంటలు నానబెట్టండి. రాత్రంతా కూడా ఉంచవచ్చు. మరునాడు పొద్దున్న రెండు టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులని నీటిలో మరిగించి ఆ నీటిని చల్లారనివ్వండి. చల్లారాక, ఆ నీటిని హెన్నా పేస్ట్ లో కలపండి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి కలపండి. అన్నీ బాగా కలిసి స్మూత్ పేస్ట్ వచ్చే వరకూ కలపండి. చేతులకి గ్లోవ్స్ వేసుకుని అప్లికేటర్ బ్రష్ తో ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించండి.ఒక గంట అలాగే వదిలేయండి.ఆ తరువాత మైల్డ్, సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తల స్నానం చేసుకోండి. ఇలా నెలకోసారి తల స్నానం చేస్తే జుట్టు నిగారిస్తుంది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Hair fall, Hair Loss

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు