Home /News /life-style /

DO YOU FACING HAIR FALL TREATMENT REGULARLY THEN FOLLOW THESE SIMPLE HAIR FALL TREATMENT TIPS FOR STRONG HAIR PRV

hair fall Treatment: జుట్టు రాలే సమస్య ఉందా? అయితే ఈ ఆహార పదార్థాలు తీసుకుంటూ.. జాగ్రత్తలు తీసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు. అలాంటి జుట్టు పొడుగుగా (long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట.

    వాతావరణంలో కాలుష్యం, మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం వంటి కారణాలవల్ల ప్రతి ఒక్కరికి జుట్టురాలే సమస్య, అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇందు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో డబ్బులు కూడా ఖర్చు చేసి, విసుగు చెంది ఉంటారు చాలామంది. జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు (women hairs) మగవారికీ ఇష్టమే.

    కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు.

    అలాంటి జుట్టు పొడుగుగా (long) పెరగాలంటే కొన్ని చిట్కాలు (hair fall Treatment) పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట. కొందరు మంచి జుట్టు (Hair) ఉన్నవారిని చూసిన ప్రతిసారి బాధపడుతుంటారు. అందుకోసం ఇంటి చిట్కాలు పాటిస్తూ.. రకరకాల ఉత్పత్తులు వాడేస్తుంటారు. అందుకే జుట్టు పొడువుగా ఒత్తుగా పెరగాలంటే కొన్ని తప్పులు చేయడం ఆపేయాలి. అవేంటో ఒకసారి చూద్దాం..

    మీ జుట్టు రాలే సమస్యకు పరిష్కారం తలపైన రాసుకునే నూనె (Oil)ల కన్నా మీరు తీసుకునే ఆహారం నుండే అధికంగా లభిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ప్రొటీన్లు (Proteins) ఎంతో అవసరం. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చికెన్‌, చేప, గుడ్లు లాంటి మాంసాహారంతో పాటు పాలు, పెరుగు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. వీటిని రోజులో ఒకసారి తప్పని సరిగా తీసుకోవాలి.

    ప్రొటీన్లతో పాటు ఐరన్‌ (Iron), జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారం (healthy food) తీసుకోవాలి. దీని కోసం చికెన్‌, మటన్‌, చేప, రొయ్యలు, గుడ్లు మొదలైన మాంసాహారంతో పాటు కందులు, పెసలు, మినుములు లాంటి పప్పుధాన్యాలు; బాదం, పిస్తా, వాల్‌ నట్స్‌, అవిసె గింజలను కూడా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. వీటన్నిటి వల్ల ఒమేగా 3 ఫాటీయాసిడ్లు కొంత వరకు లభిస్తాయి.

    విటమిన్‌ - డి  (Vitamin D) తక్కువగా ఉన్నా సరే జుట్టురాలే సమస్య వస్తుంది. ఒక వేళ విటమిన్‌ - డి లోపం ఉంటే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్‌ వాడవచ్చు. రోజూ ఇరవైనిమిషాల పాటు ఎండలో సమయం గడపడం వల్ల కూడా కొంత విటమిన్‌ డిని పొందవచ్చు. నిద్రలేమి సమస్య కూడా జుట్టురాలడానికి కారణం. ఒక వేళ అధిక బరువు వల్ల థైరాయిడ్‌ సమస్య ఉన్నట్టయితే బరువు పెరగడం నియంత్రణలోకి వస్తే జుట్టు రాలడం కొంత తగ్గుతుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair fall, Hair Loss

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు