అందంగా ఉండాలని ఎవరికి ఉండదు. అందులో స్త్రీలకు కొంచెం ఎక్కువ శ్రద్ధ. అయితే నేటి పరిస్థితుల్లో అందరికీ జుట్టు సమస్యలు ఎక్కువయ్యాయనే చెప్పాలి. పెరుగుతున్న కాలుష్యం, రేడియేషన్, ఆహార విధానాల వల్ల కూడా జుట్టు ఊడటం (hair fall), చిట్లడం, తెల్లబడటం వంటి సమస్యలు తలెత్తున్నాయి. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు (hair) పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్య (hair loss problems) ను ఎదుర్కొంటున్నారు. స్నానం తరువాత ముఖ్యంగా స్త్రీలలో (women) జుట్టు ఆరుటకు టవల్ (towel) ను చుట్టూ కుంటారు. దీని గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఈ అలవాటు (habit)ను ఇలానే కొనసాగించటం వలన భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
మృదువుగా ఉండే టవల్..
పొడిగా ఉండే జుట్టు కన్నా, తడి జుట్టు (wet hair) ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే నీటిలో నానిన జుట్టు, స్థితిస్తాపకతను కలిగి ఉండి, తెగిపోవటానికి సులువుగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కఠినంగా, పొడిగా ఉండే టవల్ లేదా టెర్రీ టవల్ తో జుట్టు లాగటం వలన మృదువుగా ఉండే వెంట్రుకల బయటి పొర దెబ్బతిని జుట్టు రాలిపోతుంది. స్నానం చేసిన తరువాత, మృదువుగా ఉండే టవల్ లేదా T-షర్ట్ ను జుట్టుపై కప్పండి, ఇలానే కొద్ది సమయం పాటూ ఉంచటం వలన సహజంగానే జుట్టు ఆరిపోతుంది. కానీ, ఈ పద్దతికి అనుసరించుటకు ఎక్కువ సమయం పట్టినప్పటికీ, తడి జుట్టుతో బయటకు వెళ్ళటం వలన వేసుకున్న బట్టలు లేదా ఇతర ముఖ్యమైన శరీర ప్రదేశాలు తడిసి ఇబ్బందులు ఎదుర్కోవటం కన్నా ఇలా సహజంగా ఆర బెట్టడం ఉత్తమం.
తడి జుట్టు నుంచి నీరు వేరు చేయటం ..
కఠిన నిర్మాణం గల టవల్ లకు బదులుగా నీటిని గ్రహించే టవల్ లేదా మైక్రోఫైబర్ టవల్ (micro fiber towel) లను వాడండి. ఈ మైక్రోఫైబర్ టవల్ లు కృత్రిమ ఫైబర్ ల నుంచి తయారు చేస్తారు. ఇవి నీటిని త్వరగా జుట్టు నుంచి లాగివేస్తాయి. ఇలా తడి జుట్టు నుంచి నీరు వేరు చేయటం వలన కొద్ది సమయంలోనే గాలికి జుట్టు ఆరుతుంది. లేదా మీ జుట్టును గాలి సహాయంతో ఆరబెట్టడానికి ముందు మృదువైన T-షర్ట్ (T shirt) తో తుడవండి.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.