Home /News /life-style /

DO YOU FACING HAIR FALL PROBLEM REGULARLY THEN FOLLOW THIS STRAWBERRY PACK FOR BETTER AND STRONG HAIRS PRV

hair fall treatment: మీ జుట్టు ధృడంగా లేదా? రాలిపోతుందా? అయితే బలమైన జుట్టు కోసం ఈ ప్యాక్​ వాడండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. చాలా మందికి అనేక రకాల జుట్టు సమస్యలు వస్తుంటాయి. వాటిని ఈ పద్ధతులతో ఈజీగా చెక్ పెట్టొచ్చు.

జుట్టు (hair) ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు . జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు.  మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది.

చాలా మందికి అనేక రకాల జుట్టు సమస్యలు వస్తుంటాయి. వాటిని ఈ పద్ధతులతో (hair fall treatment) ఈజీగా చెక్ పెట్టొచ్చు. అలాగే స్ట్రాబెర్రి కూడా జుట్టు సమస్యలని దూరం చేస్తుంది. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ మాయిశ్చరైజ్డ్‌గా ఉండి.. పట్టులా మెరవాలంటే దీనికోసం స్ట్రాబెర్రీ హెయిర్ ప్యాక్ (Strawberry Hair Pack) ఉపయోగిస్తే చాలు.. జుట్టు మెరుస్తూ ఉండడంతో పాటు పండ్ల వాసనతో అద్భుతంగా కూడా మారుతుంది. కొన్ని స్ట్రాబెర్రీలు తీసుకొని.. అందులో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత.. ఈ మిశ్రమంలో గుడ్డులోని పచ్చ సొన వేసి బాగా కలుపుకోవాలి.మెత్తని బ్రష్ ఉపయోగించి ఈ మాస్క్‌ని మీ జుట్టు కుదుళ్లకు పట్టించాలి. కుదుళ్లకు పట్టించాక మిగిలిన మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి.మాస్క్ వేసుకున్న తర్వాత ఇరవై నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి. తర్వాత జుట్టును చల్లని నీటితో కడిగేయాలి.ఇలా నెలకు రెండు సార్లు చేయడం వల్ల (hair fall treatment) మంచి ఫలితం ఉంటుంది.

కుదుళ్ల నుంచి దృఢంగా..

ఇక జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా ఉండటానికి ఒక బౌల్‌లో రెండు కప్పుల పాలు, మరో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకోవాలి. ఈ రెండింటినీ స్పూన్ సాయంతో బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత మీ జుట్టును నీటితో తడిపేసి.. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్ల నుంచి అంచుల వరకూ బాగా అప్లై చేసుకోవాలి. మాస్క్ వేసుకున్న తర్వాత పావు గంట పాటు అలా ఉంచుకోవాలి.

ముందుగా అవకాడోను తీసుకోండి. తరువాత దాన్ని బాగా గుజ్జుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో దానిని రెండు స్కూప్స్ తీసుకోవాలి. ఈ మిశ్రమంలోనే ఒక అరటి పండును గుజ్జుగా చేసి వేయాలి. అలాగే టీ స్పూన్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత వేళ్లతో ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. దీన్ని 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచుకోవాలి.  మిశ్రమం పొడిబారిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Hair fall, Hair Loss

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు