Home /News /life-style /

DO YOU FACING HAIR FALL PROBLEM REGULARLY THEN FOLLOW THIS EGG PACK FOR STRONG AND BEAUTIFUL HAIR PRV

hair fall Treatment: జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే.. ఈ టిప్స్​ ఫాలో అయిపోండి.. కురులు ధృడంగా మారడం ఖాయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామందికి తొందరగానే జుట్టు రాలిపోతుంటుంది. మార్కెట్​లో దొరికే అన్ని ప్రొడక్ట్స్​ను ఉపయోగించడం ద్వారా చుండ్రు సమస్య తీరడం అటుంచితే, రెట్టింపయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

  ఆకర్షణీయమైన పొడవాటి జుట్టు మీ అందాన్ని రెట్టింపు (Double) చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే, కొంతమంది తమ జుట్టు (Hair) ఎక్కువగా ఊడిపోతుందని బాధపడిపోతుంటారు.  చుండ్రు సమస్య కేవలం తలపైనే కాదు కనుబొమలు, భుజాలపై కూడా ఏర్పడి చర్మం (skin) పొడిబారేలా చేస్తుంది.  వయసు, వాతావరణం, అధిక పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, హెయిర్ డ్రయర్స్​ విపరీతంగా వాడటం, అలర్జీ వంటి కారణాల వల్ల చుండ్రు సమస్య తరచూ వేధిస్తుంటుంది. ఈ సమయంలో వెంట్రుకలు (hair) పెలుసుగా తయారై జట్టు పలుచబడుతుంది. దీంతో విపరీతంగా జుట్టు రాలిపోయి (hair fall) చిన్న వయస్సులోనే బట్టతల వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మొదట్లోనే దీనికి చెక్​ పెట్టాలని (hair fall Treatment) నిపుణులు సూచిస్తున్నారు. మాడుపై ఉండే చర్మతత్వానికి తగ్గట్లు షాంపూలు, ఇతర హెయిర్ కేర్ ఉత్పత్తులను ఎంచుకోవాలంటున్నారు.

  మనం తీసుకొనే ఆహారం (food) మన ఆరోగ్యంపైనే కాదు.. అందంపైన కూడా ప్రభావం చూపిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోకపోతే.. చర్మం, కురులు రెండూ కళను కోల్పోతాయి. ఆహారంలో చక్కెర, కొవ్వులు వంటివి ఎక్కువగా తీసుకొంటే జుట్టు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు ఆహారంలో ప్రొటీన్లు (Proteins in the diet), విటమిన్లు, మినరల్స్, ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండేలా జాగ్రత్తపడాలి. అప్పుడే జుట్టు దృఢంగా (Strong hairs), అందంగా మెరుస్తూ ఉంటుంది.

  సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు (Ultraviolet rays) చర్మాన్ని మాత్రమే కాదు.. కురులపై సైతం ప్రభావం చూపిస్తాయి. వీటి వల్ల జుట్టు పొడిగా, బిరుసుగా, బలహీనంగా తయారవుతుంది. కాబట్టి జుట్టుకు రక్షణ కల్పించేలా టోపీ, స్కార్ఫ్ వంటివి ఉపయోగించడం మంచిది. కర్లర్, స్ట్రెయిటనర్, డ్రైయర్.. వంటి వాటిని తరచూ ఉపయోగించడం వల్ల కూడా కురుల అందం, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండాల్సి ఉంటుంది. మీరు ప్రస్తుతం హెయిర్ లాస్ సమస్య (hair loss problem)తో ఇబ్బంది పడుతుంటే వెంటనే వాటిని ఉపయోగించడం మానేయండి.

  గుడ్డు (Egg)లో సల్ఫర్, పాస్ఫరస్, సెలీనియం, అయెడిన్, జింక్, ప్రొటీన్ మొదలైనవి ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను (hair Growth) ప్రోత్సహిస్తాయి. అందుకే ఎగ్ మాస్క్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే.. గుడ్డులోని తెల్లసొనను వేరుచేసి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో టీస్పూన్ చొప్పున ఆలివ్ నూనె (Olive Oil), తేనె (honey) కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేస్తే సరిపోతుంది.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Eggs, Hair fall

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు