Home /News /life-style /

DO YOU FACING HAIR FALL PROBLEM REGULARLY THEN FOLLOW THESE ROSEMARY LEAVES TREATMENT FOR STRONG HAIR PRV

hair fall treatment: జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఈ చిట్కాలు తప్పకుండా పాటించండి.. జుట్టును కాపాడుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన జుట్టు రాలిపోతూ ఉంటుంది, తెల్లజుట్టు చిన్న వయసులోనే వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (beauty tips) మంచి ఫలితాలను ఇస్తాయి.

ఇంకా చదవండి ...
    మనిషి అందాన్ని వారి కేశాల (hair)ను బట్టి కూడా అంచనా వేస్తున్నారు. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (black hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు (health issues) వలన జుట్టు రాలే (hair fall) సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన జుట్టు రాలిపోతూ ఉంటుంది, తెల్లజుట్టు చిన్న వయసులోనే వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (beauty tips) మంచి ఫలితాలను ఇస్తాయి.

    ప్రతివారం నూనె (oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు (beautiful hair) అందరికీ ఉండేది. కానీ ఇప్పటి కాలుష్యం (pollution), షాంపూలు (shampoos), హెయిర్ ప్రొడక్ట్స్ పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయారు. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తున్నాయి. రోజ్మేరీ ఆకులు, మెంతులు,  జుట్టును అందం (beautiful)గా మార్చుకోవచ్చు. ఆ పద్దతి (hair fall Treatment) ఒకసారి తెలుసుకుందాం..

    రోజ్మేరీ ఆకులు..

    పేన్ల నుంచి చుండ్రు (dandruff) నివారణ వరకు రోజ్మేరీ ఆకులు (Rosemary leaves) అనేక వైద్య ప్రయోజనాలను అందిస్తాయి. సాధారణ ఈ సమస్యలతో పోరాడటానికి ఈ చిట్కా(Hair fall Treatment)  మీకు సహాయపడుతుంది. ఇవి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా జుట్టు పెరుగుదలను రోజ్మేరీ ప్రోత్సహిస్తాయి. జుట్టును మరింత మెరిసేలా… మందంగా మారుస్తాయి.

    పాన్‌లో కరివేపాకు లేదా గోరింటాకు ఆకులు వేయండి. 5 చెంచాల ఆముదం, బాదం, కొబ్బరి నూనెను అందులో వాటిని మరగబెట్టండి. నిల్వ చేయడానికి ఆకులను ఫిల్టర్ చేసి.. ఒక మట్టి పాత్రలో నూనె పోయాలి. మరిగించిన నూనె గోరువెచ్చగా మారిన తర్వాత 5-10 నిమిషాలు మీ తలపై మసాజ్ చేయండి. కడిగే ముందు కనీసం 1 గంట పాటు అలాగే ఉంచండి.

    చుండ్రు చికిత్సకు..

    జుట్టు పెరుగుదలకు ఒక సాధారణ ఔషధం మెంతులు (Dill) అని చెప్పవచ్చు. జట్టు మెరుపును పెంచడంలో సహాయపడటమే కాకుండా చుండ్రు చికిత్సకు కూడా మెంతులు ఉపయోగపడతాయి. ఒక పాన్‌లో 2 చెంచాల ఆలివ్, కొబ్బరి, ఆముదం జోడించండి. దానికి 2 చెంచాల మెంతి గింజలు వేసి 5 నిమిషాలు మరిగించడండి. ఆ తర్వాత మెతులను వడకట్టండి. నూనె నిల్వ చేయడానికి ఒక సీసాలో నింపండి. మీ తలకు గోరువెచ్చని నూనె రాసి బాగా మసాజ్ చేయండి. ఉత్తమ ఫలితాల కోసం రాత్రిపూట అలాగే ఉంచి.. మరుసటి రోజు ఉదయం కడిగేయండి. కనిపించే ఫలితాల కోసం నెలకు రెండుసార్లు ప్రతి వారం ఇలా చేయండి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair fall, Hair Loss, Treatment

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు