Home /News /life-style /

DO YOU FACING HAIR FALL PROBLEM REGULARLY THEN FOLLOW THESE ONION PACK TIPS FOR HAIR GROWTH PRV

Beauty tips tips: జుట్టు బాగా రాలిపోతుందా? అయితే ఉల్లిపాయ రసం చిట్కాతో సమస్యకు చెక్​ పెట్టొచ్చు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాలుష్యం, షాంపూలు (shampoo), హెయిర్ ప్రొడక్ట్స్ పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయారు. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఆ సహజ పదార్థాలతో జుట్టుని కాపాడుకోవచ్చు.

    కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా (beauty) కనిపిస్తాయి. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు(hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇప్పటి hai

    ఉల్లిపాయ రసం..

    జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు (dandruff) కూడా ఒకటి. సరైన పోషకాలను అందించకపోతే చుండ్రు తో సహా ఇతర సమస్యలు కూడా వస్తాయి. జుట్టు రాలడాన్ని(hair fall) నివారించడానికి ఉల్లిపాయ రసాన్ని జుట్టు సంరక్షణ దినచర్యలో చేయడానికి ప్రయత్నించండి. మీ జుట్టుకి  ఉల్లిపాయ రసం (Onion Juice) తీసుకొని, అందులో ఒకటి నుండి రెండు టీ స్పూన్ల తేనె కలిపి,  ఈ మిశ్రమాన్ని మీ తల తో సహా జుట్టు అంతా రాయండి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. అంతేకాకుండా మంచి ఆహారం కూడా మీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

    కలబంద వల్ల మనుషులకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే జుట్టుకు, చర్మానికి కూడా కలబంద చాలా ఉపయోగపడుతుంది.  కలబంద ,కొబ్బరి నూనె (Coconut oil) ,ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ నూనె తయారీకి మొదట చేయవలసిన పని ఉల్లిపాయను మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ రసం తాజాగా ఉండేలా చూసుకోవాలి. తరువాత కలబంద పేస్ట్ ను , కొబ్బరి నూనెతో ఉల్లిపాయ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు జుట్టుకు పూయాలి.  తద్వారా మీ జుట్టు అందంగా (Beauty) , మందంగా, పొడవుగా (long) బలంగా కనిపిస్తుంది. ఉల్లి రసం, ఆలివ్ ఆయిల్ (olive Oil) కలిపి తలమీద పూయడంవల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair fall, Hair Loss

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు