Home /News /life-style /

DO YOU FACING HAIR FALL PROBLEM HEAVILY THEN YOU SHOULD TAKE CARE ABOUT FEW THINGS AND FOLLOW THIS TIPS PRV

Hair problem tips: జుట్టు ఎక్కువగా రాలిపోతోందా? అయితే మీరు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది.. వివరాలివే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

జుట్టు పొడుగుగా(long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట. అంతేకాకుండా జుట్టు పొడువుగా ఒత్తుగా పెరగాలంటే కొన్ని తప్పులు చేయడం ఆపేయాలి.

    అందంగా కనిపించడం కోసం లేనివీ పోనివీ ఫేస్​ ప్యాక్​లు(face packs), క్రీమ్​లు, హెయిర్​ ఆయిల్​లు వాడి ఉన్న జుట్టు, అందాన్ని పాడు చేసుకుంటున్నారు. జుట్టు రాలిపోవడం అన్నది చాలా మందిలో సహజమైన సమస్య. ఎందుకంటే మారిన వాతావరణ పరిస్థితులు.. పొల్యూషన్.. జీవనశైలి మారడం.. ఇలా రకరకాల కారణాలతో జుట్టు రాలిపోతుంటుంది. ఈ రోజుల్లో ఎవరైనా బయటకు వెళ్లక తప్పాల్సిన పరిస్థితి. దీంతో బయట పొల్యూషన్.. జుట్టుకు సరైన రక్షణ లేకపోవడంతో రాలిపోతుంటుంది.


    hair care, hair fall, balanced diet, hair pack, జుట్టు రాలటం, సమతుల ఆహారం
    కొంతమందికి చిన్నవయసులోనే జుట్టు రాలిపోతున్నట్టు కనిపిస్తుంది. 15 ఏళ్ల తర్వాత ఎవరికైనా జుట్టు రాలడం సర్వ సాధారణంగా జరుగుతుంది. ఈ వయసులో సహజంగా జుట్టు రాలడం క్రమంగా జరుగుతుంది. కుటుంబ సంప్రదాయం తప్పనిసరిగా కారణం కాకపోవచ్చు. సుదీర్ఘ అనారోగ్యం లేదా పెద్ద శస్త్రచికిత్స, తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదా ఒత్తిడి, ధూమపానం, ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం కూడా కారణం కావచ్చు.


    life style, girls don‘t like those boys, which babbits girls are dont like, అందమైనా అమ్మాయిలు వీటిని ఇష్ట పడరు. ఈ ఐదు అలవాట్లు ఉంటే అమ్మాయిలకు నచ్చరు, అమ్మాయిలకు నచ్చాలి అంటే ఈ ఐదు అలవాట్లకు దూరంగా ఉండాలి
    ఇది కాకుండా, ఆండ్రోజెన్ హార్మోన్ లేకపోవడం వల్ల, జుట్టు రాలడం కూడా మొదలవుతుంది. ఇది బట్టతలగా మారుతుంది. ఇది ప్రత్యేకంగా శిశువుకు జన్మనిచ్చిన తర్వాత మహిళల్లో జరుగుతుంది. శరీరంలో విటమిన్ సి లేకపోవడం వల్ల జుట్టు రాలడం, బూడిదరంగు ఒక కారణం. కివి పండు, టమోటా, నిమ్మ, నారింజ మొదలైన విటమిన్ సి మూలాలు జుట్టు ఆరోగ్యానికి అవసరం.


    hair fall treatement, life style, health tips, health benefits, hair fall, hair fall reasons, hair fall tension, లైఫ్ స్టైల్, హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ టిప్స్, జట్టు రాలిపోతోందా? జట్టు రాలిపోవడానికి ఇదే కారణం, చిన్న వయసులోనే జట్టు రాలిపోతుందా? hair fall tips
    చాలా సార్లు, ఆహారంలో నిర్లక్ష్యం కారణంగా, మహిళల్లో ఇనుము లోపం ఏర్పడుతుంది, దాని కారణంగా వారు రక్తహీనతకు గురవుతారు. ఇది పోషకాహారలోపం, రుతుస్రావం సమయంలో అధిక రక్తస్రావం, శరీరంలో ఇనుము లోపం ఏర్పడుతుంది. ఈ కారణంగా జుట్టు రాలడం మొదలవుతుంది.


    Diet tips for strong and healthy hair, hair problems solution, how to prevent hair loss, bald head tips, dandruff solution, how to get healthy hair, telugu health tips, lifestyle news, telugu lifestyle news, జుట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారం, జుట్టు రాలడం, తెల్ల జట్టు, బట్ట తల, తెలుగు ఆరోగ్య చిట్కాలు, తెలుగు సౌందర్య చిట్కాలు
    ముఖ్యంగా బయటకు వెళ్లే మహిళల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో ప్రతి మూడో మహిళ థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. థైరాయిడ్ గ్రంథి శరీరంలోని ఒక ముఖ్యమైన గ్రంథి, దీని కారణంగా శరీరం దాని అసమతుల్యత కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. జుట్టు రాలడం కూడా దీనికి ఒక కారణం.


    hair care, hair fall, balanced diet, hair pack, Rain fall in rain session, hair fall tips,  జుట్టు రాలటం, సమతుల్య ఆహారం, జుట్టు రాలిపోతోందని బాధపడుతున్నారు. వర్షాకాలంలో జుట్టు రాలుతోందా..? జట్టు రాలకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
    జుట్టు రాలే సమస్య ఉన్నవాళ్లల్లో థైరాయిడ్ లేదా వేరే సమస్య ఉన్నవారు అయితే తప్పకుండా విస్మరించవద్దు. ఇలాంటి వారు కచ్చితంగా వెంటనే వైద్యుడిని సంప్రదించండం మంచిది. లేదంటే ఆ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ జట్టు రాలే సమస్య నుంచి బయట పడాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..


    ఉల్లిపాయను కోసి మెత్తగా రుబ్బుకుని రసం తీయడానికి ఫిల్టర్ చేయండి. ఈ రసాన్ని జుట్టు మూలాలకు 15 నుండి 20 నిమిషాల పాటు అప్లై చేసి తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోండి. మెరుగైన ఫలితాల కోసం వారానికి రెండుసార్లు జుట్టుకు అప్లై చేయండి. ఉల్లిపాయలలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది వేగంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.


    గుడ్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కొబ్బరినూనెతో గుడ్డులోని తెల్లసొనను మిక్స్ చేసి, వెంట్రుకలకు, మూలాల వరకూ రాయండి. తర్వాత షాంపూని కడిగేయండి. దీనిని వారానికి ఒకటి లేదా రెండుసార్లు కూడా అప్లై చేయవచ్చు. మార్కెట్లో వచ్చే కొత్త షాంపూల కోసం భారీగా ఖర్చు చేయకుండా.. ఈ రెండు చిట్కాలు వాడితే కచ్చితంగా హెయిర్ ఫాల్ ను అరికట్ట వచ్చు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair fall, Hair problem tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు