జుట్టు (Hair) రాలుతోందని తెలిస్తే చాలు ఏదో ఆందోళన. మన దగ్గర నుంచీ ఏదో దూరమైపోతోందన్న ఇబ్బంది. వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్నా (hair fall), బట్టతల వస్తున్నట్లు అనిపిస్తున్నా, తమకు తెలియకుండానే ఒక రకమైన టెన్షన్‌లో పడిపోతుంటారు చాలా మంది. ఇక జీవితం ముగిసిపోయినట్లుగా, ముసలితనం వచ్చేసినట్లుగా రకరకాలుగా ఊహించుకుంటూ, తమలో తామే కుమిలిపోతుంటారు. జుట్టు రాలకుండా ఉండేందుకు ఏం చెయ్యాలా అని రకరకాల షాంపూలూ, క్రీములూ వాడతారు. అవేవీ పనిచెయ్యకపోతే, చివరకు హెయిర్ లాస్ ట్రీట్‌మెంట్లు (Hair loss Treatment) కూడా చేయించుకుంటారు. అయినా సంతృప్తి కలగదు. ఇంతలా వేధిస్తున్న ఈ సమస్య ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉంది. కొన్ని కోట్ల మందిని జుట్టు రాలే (hair loss) సమస్య వెంటాడుతోంది.
జుట్టు రాలడం (hair loss) సాధారణ సమస్యే అని తేలిగ్గా తీసుకుందామన్నా, పక్కనే ఉండే స్నేహితులు, తోటివారు పదే పదే జుట్టు రాలిపోతోందని గుర్తు చేస్తుంటే, కలిగే అసౌకర్యం మాటల్లో చెప్పలేనిది. కొన్ని జాగ్రత్తలు Hair loss Treatment) పాటిస్తే, జుట్టు రాలే సమస్యను చాలా వరకూ తగ్గించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
చలికాలంలో శిరోజాల సంరక్షణ (Hair loss Treatment) పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వేడి నీళ్ల స్నానం వల్ల జుట్టు తేమను కోల్పోతుంది. జుట్టు చివర్లు పగులుతాయి. జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. అయితే ఈ జాగ్రత్తలను (Hair loss Treatment) తీసుకోవడం ద్వారా శిరోజ సౌందర్యం కాపాడుకోవచ్చు. ఏం చేయాలంటే..
ఒక బౌల్‌లో ఒక టీస్పూన్ షాంపూ (Shampoo) తీసుకుని అందులో కొద్దిగా ఆముదం, గ్లిసరిన్, యాపిల్ సిడార్ వెనిగర్‌ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తడిగా ఉన్న జుట్టుకు పట్టించాలి. పావుగంట తరువాత షాంపూతో కడిగేసుకోవాలి.
ఒక అరటిపండు(banana), ఒక టీస్పూన్ ఆలివ్‌ఆయిల్ (Olive Oil), ఒక టీస్పూన్ అలొవెరా జెల్... ఈ మూడింటిని కలిపి పేస్టులా చేసుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే జుట్టు మృదువుగా తయారవుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి బియ్యం నానబెట్టిన నీరు బాగా పనికొస్తుంది.
ముందుగా బియ్యాన్ని (Rice) శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు పోసి రెండు రోజుల పాటు నానబెట్టాలి. ఆ నీటిని ఒక పాత్రలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్లను ఫ్రిజ్‌లో పెట్టుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. రెండు స్పూన్ల మెంతులను రాత్రిపూట నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ మెంతులను పేస్టులా పట్టుకుని, కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి.
అరగంట తరువాత కుంకుడుకాయలతో శుభ్రం చేసుకోవాలి. కుంకుడుకాయలు లేకపోతే హెర్బల్ షాంపూ ఉపయోగించవచ్చు. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. కొబ్బరిపాలలో నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. నాలుగైదు గంటల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.