Home /News /life-style /

DO YOU FACING HAIR FALL AND DANDRUFF PROBLEM THEN FOLLOW THIS HAIR PACK TIPS FOR STRONG HAIR PRV

hair packs: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? చుండ్రు ఎక్కువగా ఉందా? అయితే ఈ హెయిర్​ప్యాక్​లను వాడండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

వయసు, వాతావరణం, అధిక పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, హెయిర్ డ్రయర్స్​ విపరీతంగా వాడటం, అలర్జీ వంటి కారణాల వల్ల చుండ్రు (dandruff) సమస్య తరచూ వేధిస్తుంటుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఇంట్లోనే సహజసిద్ధమైన చిట్కాల్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇంకా చదవండి ...
    ఆకర్షణీయమైన పొడవాటి జుట్టు మీ అందాన్ని రెట్టింపు (Double) చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే, కొంతమంది తమ జుట్టు ఎక్కువగా ఊడిపోతుందని (hair fall) బాధపడిపోతుంటారు. వర్షాకాలం రాగానే వాతావరణంలో అధిక తేమ కారణంగా తలపై చుండ్రు (dandruff) ఏర్పడుతుంది. ఈ చుండ్రు సమస్య కేవలం తలపైనే కాదు కనుబొమలు, భుజాలపై కూడా ఏర్పడి చర్మం పొడిబారేలా చేస్తుంది.

    వయసు, వాతావరణం, అధిక పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, హెయిర్ డ్రయర్స్​ విపరీతంగా వాడటం, అలర్జీ వంటి కారణాల వల్ల చుండ్రు (dandruff) సమస్య తరచూ వేధిస్తుంటుంది. ఈ సమయంలో వెంట్రుకలు పెలుసుగా తయారై జట్టు పలుచబడుతుంది.  ఈ సమస్యలను తగ్గించుకోవడానికి బయట మార్కెట్లో దొరికే వివిధ రకాల కండీషనర్ లను, షాంపూలను, క్రీమ్స్ లను వాడడం తగ్గించి ఇంట్లోనే సహజసిద్ధమైన చిట్కాల్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే పెరుగుతో చేసుకొనే హెయిర్ ప్యాక్స్ (Hair packs) జుట్టు సంరక్షణకు మంచి ఫలితాలనిస్తాయని బ్యూటీషియన్స్ తెలుపుతున్నారు. ఇప్పుడు పెరుగుతో చేసుకునే హెయిర్ ప్యాక్స్ (hair packs) గురించి తెలుసుకుందాం.

    చుండ్రు సమస్య..

    తలలో ఇన్ఫెక్షన్ ల కారణంగా ఏర్పడిన చుండ్రు (dandruff), అలర్జీ వంటి సమస్యలను తగ్గించడానికి ఈ హెయిర్ ప్యాక్ బాగా సహాయపడుతుంది. పెరుగులో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుని తగ్గిస్తాయి. ఇందుకోసం ఒక కప్పు పెరుగులో (Curd) కొద్దిగా నిమ్మరసం (Lemon juice), కొద్దిగా తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మాడు నుంచి జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం (Head bath) చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు (Dandruff) సమస్యల నుంచి శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది.

    జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది..

    పోషకాల లోపం కారణంగా జుట్టు అధిక మొత్తంలో రాలిపోవడం జరుగుతుంది. అయితే పెరుగు జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో సగం కప్పు పెరుగు (Curd), మూడు టేబుల్ స్పూన్ ల మెంతి పొడిని (fenugreek powder) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ (Hair pack) జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా, నల్లగా, అందంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది జుట్టుకు మంచి కండిషనర్ (Conditioner) గా పనిచేస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Curd, Hair problem tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు