ఆకర్షణీయమైన పొడవాటి జుట్టు మీ అందాన్ని రెట్టింపు (Double) చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే, కొంతమంది తమ జుట్టు (Hair) ఎక్కువగా ఊడిపోతుందని బాధపడిపోతుంటారు. వాతావరణంలో అధిక తేమ కారణంగా తలపై చుండ్రు ఏర్పడుతుంది. ఈ చుండ్రు సమస్య కేవలం తలపైనే కాదు కనుబొమలు, భుజాలపై కూడా ఏర్పడి చర్మం పొడిబారేలా చేస్తుంది. చుండ్రు (Dandruff) కు చెక్‌పెట్టేందుకు ఇంటర్నెట్లో అనేక పద్ధతులు (Methods) ఉన్నాయి. కానీ సరైన వాస్తవాలను తెలుసుకొని మాత్రమే వాటిని ప్రయత్నించాలని (hair fall treatment) సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మార్కెట్లో దొరికే అన్ని ప్రొడక్ట్స్‌ను ఉపయోగించడం ద్వారా చుండ్రు సమస్య తీరడం అటుంచితే, రెట్టింపయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వయసు, వాతావరణం, అధిక పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, హెయిర్ డ్రయర్స్ విపరీతంగా వాడటం, అలర్జీ వంటి కారణాల వల్ల చుండ్రు (Dandruff) సమస్య తరచూ వేధిస్తుంటుంది. ఈ సమయంలో వెంట్రుకలు పెలుసుగా తయారై జట్టు పలుచబడుతుంది. దీంతో విపరీతంగా జుట్టు రాలిపోయి (hair fall) చిన్న వయస్సులోనే బట్టతల వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మొదట్లోనే దీనికి చెక్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మాడుపై ఉండే చర్మతత్వానికి తగ్గట్లు షాంపూలు, ఇతర హెయిర్ కేర్ (hair care) ఉత్పత్తులను ఎంచుకోవాలంటున్నారు.
మన చుట్టూ ఉండే సహజ వనరులలో ఎన్నో పోషకాలున్నాయి. అలాగే సహజంగా లభించే పదార్థాలతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. చర్మ సమస్యలు (Skin problem), జుట్టు సమస్యలు (hair problem) తగ్గించవచ్చని చాలా వరకు తెలియదు. ముఖ్యంగా ములక్కాయ ఆకులతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎక్కువగా సహాయపడతాయి. కేవలం ఇవే కాకుండా.. జుట్టు సమస్యలను కూడా ఈ ములక్కాయ ఆకులు (Chili leaves) తగ్గిస్తాయి. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలంటే.
అరకప్పు ములక్కాయ ఆకులను (Chili leaves) పేస్ట్ గా చేసుకోవాలి. అందులోనే బాదం నూనె 2 టేబుల్ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ కాక్టస్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లపై మర్దనా చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు రెండు మూడు సార్లు చేస్తే జుట్టు రాలడం (hair fall) క్రమంగా తగ్గుతుంది. ఇవే కాకుండా ములక్కాయ ఆకులతో టేబుల్ స్పూన్ నెయ్యి, టేబుల్ స్పూన్ కాక్టస్ వేసి పేస్ట్ గా తయారు చేసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేస్తే జుట్టుకు పోషకాలు అందుతాయి.
శీకాయ, కుంకుడుకాయలు జుట్టుకి చక్కటి క్లెన్సర్స్‌గా (cleaners) పనిచేస్తాయి. మాడుని శుభ్ర పరుస్తాయి (clean). వీటిలో ఉండే విటమిన్-ఎ, కె, సి,డీలు జుట్టును ఆరోగ్యం (healthy hair)గా ఉంచుతాయి. ముందుగా ఈ కాయల్ని వేడి నీళ్లల్లో వేసి మరగనివ్వాలి. అందులోనే గుప్పెడు మందార పూలూ కూడా వేయాలి. బాగా కాచిన ఆ నీళ్లను చల్లారాక వడకట్టాలి. ఆపై వాటితో తలస్నానం చేస్తే సరి. జుట్టు మెత్తగా మారుతుంది. చుండ్రు (dandruff) సమస్య దరిచేరదు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.