Home /News /life-style /

Digestive problems: భోజనం చేశాక ఆహారం అరగట్లేదా? అయితే ఈ పద్దతి తప్పక ఫాలో అవండి

Digestive problems: భోజనం చేశాక ఆహారం అరగట్లేదా? అయితే ఈ పద్దతి తప్పక ఫాలో అవండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మ‌నం తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతోపాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరానికి అందేలా చూడ‌డంలో జీర్ణ వ్య‌వ‌స్థ పాత్ర చాలా కీల‌క‌మైంది. దీంతోపాటు ఆ ఆహార ప‌దార్థాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌వ‌స్థ బ‌య‌టకు పంపుతుంది.

    వేళకు ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. మనం తినే ఆహారం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అందరికీ తెలిసిందే. ఫాస్ట్ ఫుడ్ తో జీర్ణం కాక... అధిక బరువు పెరగడం.. ఒక్కటేమిటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక మ‌నం తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతోపాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరానికి అందేలా చూడ‌డంలో జీర్ణ వ్య‌వ‌స్థ పాత్ర చాలా కీల‌క‌మైంది. దీంతోపాటు ఆ ఆహార ప‌దార్థాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌వ‌స్థ (digestive) బ‌య‌టకు పంపుతుంది.

    అయితే జీర్ణ‌వ్య‌వ‌స్థ  (digestive) ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు నొప్పి, అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుచుకునేందుకు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో జీర్ణం బాగా అవ‌డ‌మే కాదు, ఆయా జీర్ణ స‌మ‌స్య‌లు  (digestive problems) కూడా రాకుండా ఉంటాయి. యాపిల్ పండ్ల‌లో పుష్క‌లంగా ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌య్యేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. క‌నుక నిత్యం యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. సోంపు గింజ‌ల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణాశ‌యంలో ఆహారం క‌ద‌లిక‌ను స‌రిచేస్తుంది. దీంతో క‌డుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది.

    అరటిపండు (banana)లో సహజ యాంటాసిడ్ ఉంటుంది. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. అరటిపండు మీ శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఓట్స్ ఒక రుచికరమైన ఇంకా తేలికపాటి ఆహారం. దీనిని ఖాళీ కడుపుతో తినవచ్చు. సాల్టెడ్ ఓట్స్‌లో ఎలాంటి మసాలా దినుసులను కలుపవద్దు. ఇది ఉదర సమస్యలను మరింత పెంచుతుంది. స్వీట్ ఓట్స్ పాలలో వండుతారు. దానిని నీటిలో కూడా ఉడికించవచ్చు. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది.

    నిత్యం ఉద‌యాన్నే అల్పాహారానికి ముందు కొద్దిగా అల్లం ర‌సం సేవిస్తే.. మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అలాగే వికారం, వాంతులు త‌గ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ రాకుండా ఉంటాయి. భోజ‌నానికి ముందు పుదీనా ర‌సం తీసుకుంటే జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది, విరేచ‌నాలు ఆగుతాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health benefits, Health care, Health Tips

    తదుపరి వార్తలు