Home /News /life-style /

DO YOU FACING DANDRUFF PROBLEM IN YOUR HAIR THEN FOLLOW THIS DRILL CURRY PACK FOR BETTER HAIR PRV

hair loss treatment: చుండ్రు సమస్య ఎక్కువగా ఉందా? అయితే ఈ మెంతి కూర, నిమ్మరసం ప్యాక్​తో చుండ్రు తొలగించుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చుండ్రుకు చెక్​పెట్టేందుకు అనేక పద్ధతులు (beauty tips) ఉన్నాయి. కానీ సరైన వాస్తవాలను తెలుసుకొని మాత్రమే వాటిని ప్రయత్నించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం ( hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే (hair loss) సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది.

వాతావరణంలో అధిక తేమ కారణంగా తలపై చుండ్రు (dandruff) ఏర్పడుతుంది. ఈ చుండ్రు సమస్య కేవలం తలపైనే కాదు కను బొమ్మలు (eye brows), భుజాలపై కూడా ఏర్పడి చర్మం (skin) పొడి బారేలా చేస్తుంది. చుండ్రుకు చెక్​పెట్టేందుకు అనేక పద్ధతులు (hair loss treatment) ఉన్నాయి. కానీ సరైన వాస్తవాలను తెలుసుకొని మాత్రమే వాటిని ప్రయత్నించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మార్కెట్​లో దొరికే అన్ని ప్రొడక్ట్స్​ను ఉపయోగించడం ద్వారా చుండ్రు సమస్య తీరడం అటుంచితే, రెట్టింపయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మంచి ఆరోగ్యమైన ఇంకా అందమైన జుట్టు (beautiful hair) కూడా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తారు. చాలా మంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో తెగ బాధ పడుతూ ఉంటారు  చుండ్రు సమస్యతోను, అలాగే జుట్టు రాలిపోయే సమస్యతో బాధ పడుతూ ఉంటారు. ఇక అలా అనేక జుట్టు సమస్యలతో (hair problems) బాధ పడేవారు ఈ పద్ధతులు (hair loss treatment) పాటించండి.

శీకాకాయ, కుంకుడుకాయలు..

సమపాళ్లలో గోరింటాకు (henna), మెంతి కూరల్ని (dill curry) తీసుకుని రుబ్బుకోవాలి. దీనికి చెంచా పెరుగు (curd), కాస్త నిమ్మరసం (lemon) కలిపి వెంట్రుకలకు పట్టించి అర గంట ఆగి తలస్నానం చేస్తే నిగనిగలాడతాయి. శీకాకాయ, కుంకుడుకాయలు జుట్టుకి చక్కటి క్లెన్సర్స్‌గా పనిచేస్తాయి. మాడుని శుభ్ర పరుస్తాయి. వీటిలో ఉండే విటమిన్‌-ఎ, కె, సి, డిలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ముందుగా ఈ కాయల్ని వేన్నీళ్లల్లో వేసి మరగనివ్వాలి.

జుట్టు మెత్తగా మారుతుంది..

అందులోనే గుప్పెడు మందార పూలూ కూడా వేయాలి. బాగా కాచిన ఆ నీళ్లను చల్లారాక వడకట్టాలి. ఆపై వాటితో తలస్నానం చేస్తే సరి. జుట్టు మెత్తగా మారుతుంది. చుండ్రు (dandruff) సమస్యా దరిచేరదు. కాస్టర్ ఆయిల్ అత్యంత ప్రయోజనకరమైన నూనెలలో (oil) ఒకటిగా పరిగణించబడుతుంది.

తెల్ల  వెంట్రుకలను తగ్గిస్తుంది..

ఆముదం నూనె వాడడం వల్ల జుట్టు మృదువుగా పెరుగుతుంది. ఈ నూనె (oil) జుట్టుకు తేమను ఇస్తుంది మరియు తెల్ల  వెంట్రుకలను తగ్గిస్తుంది. మంచి ఫలితాలను పొందడానికి, వారానికి రెండుసార్లు జుట్టుకు కాస్టర్ ఆయిల్ వాడింది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి:  మీ మోకాళ్ల అందం తగ్గిపోతుందా? నల్లగా మారుతున్నాయా? అయితే ఇలా చేసి సమస్య దూరం చేసుకోండి
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Beauty tips, Hair Loss

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు