Home /News /life-style /

DO YOU FACING DANDRUFF PROBLEM HEAVILY THEN FOLLOW THIS SIMPLE METHODS TO GET RID OF THAT AND SAVE YOUR HAIRS PRV

Dandruff removal: డాండ్రఫ్​ సమస్య ఎక్కువగా ఉంటుందా? అయితే ఈ చిట్కాలతో చుండ్రు తొలగించుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డాండ్రఫ్​ చాలా మందికి సమస్యగా ఉంటుంది. చుండ్రుకు చెక్​పెట్టేందుకు ఇంటర్నెట్‌లో అనేక పద్ధతులు (Methods) ఉన్నాయి. కానీ సరైన వాస్తవాలను తెలుసుకొని మాత్రమే వాటిని (Dandruff treatment) ప్రయత్నించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు

    వాతావరణంలో అధిక తేమ కారణంగా తలపై చుండ్రు (Dandruff) ఏర్పడుతుంది. ఈ చుండ్రు సమస్య కేవలం తలపైనే కాదు కనుబొమ్మలు, భుజాలపై కూడా ఏర్పడి చర్మం పొడిబారేలా చేస్తుంది. చుండ్రుకు చెక్​పెట్టేందుకు ఇంటర్నెట్‌లో అనేక పద్ధతులు (Methods) ఉన్నాయి. కానీ సరైన వాస్తవాలను తెలుసుకొని మాత్రమే వాటిని (Dandruff treatment) ప్రయత్నించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మార్కెట్​లో దొరికే అన్ని ప్రొడక్ట్స్​ను ఉపయోగించడం ద్వారా చుండ్రు (Dandruff) సమస్య తీరడం అటుంచితే, రెట్టింపయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చుండ్రు సమస్యతో పోరాడుతున్నప్పటికీ, జుట్టు కోసం హెయిర్​ ఆయిల్ (hair oil)​, ఇతర స్టైలిష్​ ఉత్పత్తుల వినియోగంపై చాలామంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. అయితే దీని వల్ల ఎటువంటి సమస్య లేనప్పటికీ.. ఉపయోగిస్తున్న ఉత్పత్తులను ఒకటికి రెండు సార్లు చెక్​ చేసుకోవడం మంచిది. కొన్ని ఉత్పత్తుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ (Side Effects)​ వచ్చే ప్రమాదం ఉంది. చుండ్రు సమస్య సాధారణంగా చర్మం పొడిగా ఉండే వారిలో అధికంగా ఉంటుంది.

    వయసు, వాతావరణం, అధిక పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, హెయిర్ డ్రయర్స్​ విపరీతంగా వాడటం, అలర్జీ వంటి కారణాల వల్ల చుండ్రు (Dandruff) సమస్య తరచూ వేధిస్తుంటుంది. ఈ సమయంలో వెంట్రుకలు పెలుసుగా తయారై జట్టు పలుచబడుతుంది. దీంతో విపరీతంగా జుట్టు రాలిపోయి చిన్న వయస్సులోనే బట్టతల వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మొదట్లోనే దీనికి చెక్​ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.  మాడుపై ఉండే చర్మతత్వానికి తగ్గట్లు షాంపూలు, ఇతర హెయిర్ కేర్ ఉత్పత్తులను ఎంచుకోవాలంటున్నారు.

    నిమ్మరసం (lemon) చుండ్రును వదలించుకోవడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి. సాధారణ నూనెతో నిమ్మరసాన్ని ఉపయోగించండి. కొబ్బరి నూనెలో కొన్ని నిమ్మ చుక్కల కలపండి. దీన్ని మీ తలపై అప్లై చేయండి. 3 నుంచి 5 నిమిషాలు మసాజ్ చేయండి. 1 గంట అలాగే ఉంచి కడగాలి. చుండ్రు (Dandruff) ను వదిలించుకోవడానికి యాంటీ డాండ్రఫ్ షాంపూని కూడా ఉపయోగించవచ్చు. ఇందులో పుదీనా ఉంటుంది. ఇది తేలికపాటి చుండ్రు (Dandruff)ను తొలగించడంలో సహాయపడుతుంది. కానీ చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే అది ఎటువంటి మెరుగైన ప్రభావాన్ని చూపదు.

    వేప హెయిర్ ఆయిల్ (Neem hair oil) జుట్టు కోసం ఉపయోగించండి. తల దురద, చుండ్రు నుండి ఉపశమనం పొందడానికి వేప జుట్టు నూనె బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత తేలికపాటి షాంపూ (Shampoo)తో తలను కడగాలి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. రెగ్యులర్ షాంపూ వాడుతున్నట్లైతే.. కొన్ని చుక్కల ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ లేదా పిప్పరమెంటు ఎసెన్షియల్ ఆయిల్‌ని జోడించి దానిని ఉపయోగించవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Dandruff, Hair problem tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు