Home /News /life-style /

DO YOU FACING CHEST OR ANY HEART PAIN REGULARLY THEN YOU SHOULD TAKE SOME PRECAUTIONS AND FOLLOW THIS SIMPLE TIPS PRV

Chest pain: ఛాతిలో తరచుగా మంట, నొప్పిగా ఉంటుందా? అయితే మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే బెటర్​..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒకప్పుడు బీపీ లేదా గుండెజబ్బులు (Heart Disease) కాస్త పెద్ద వయసు వారికే వచ్చేవి. ఈ మధ్య కాలంలో పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే వచ్చేస్తున్నాయి. నేటి బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి, టెన్షన్ల వంటివి... గుండెపై ప్రభావం చూపుతున్నాయి

    చుట్టూ ఉన్న ప్రపంచంలో వాతావరణం కూడా కలుషితం అవుతోంది. కనీసం స్వచ్ఛమైన గాలి (Fresh Air) కూడా అందడం లేదు మనిషికి. అయితే చాలామందికి గుండెలో లేదా ఛాతి (Chest)లో అకస్మాత్తుగా మంటగా ఉంటుంది. ఛాతిలో మంట (Chest pain)గా ఉండటం, గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అనిపించడం, శరీరం ఉబ్బడం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం (digest) కాకపోవడం. ఇలా మంట ఇబ్బంది పెడుతున్నప్పుడు ముట్టుకోకూడని ఆహారాలేంటో (don’t touch these food) తెలుసుకుందాం.

    పానీయాలు

    ఆల్కహాల్, కాఫీ (coffee), టీ, కార్బోనేటెడ్ పానీయాలు, టమాట (tomato) రసం మొదలైనవి ముట్టుకోవద్దు. ఫ్రెంచ్ ఫ్రైస్, బాగా ఫ్రై చేసిన ఉల్లిపాయలు, బంగాళదుంప చిప్స్, వెన్న(ghee), చిక్కటి పాలు (Milk), ఛీజ్, ఐస్ క్రీమ్, ఎక్కువ కొవ్వు ఉండే సలాడ్లు, క్రీమ్ సాస్, ఎక్కువ కొవ్వు ఉండే మాంస పదార్థాలు పక్కన పెట్టాలి. చాలామంది త్రేన్పులకి కారణం చాక్లెట్ అయ్యుంటుంది. అందుకే వెంటనే మీకిష్టమైన ఆహారాల్లోంచి దాన్ని తీసేయండి.

    గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే మంచి, సరిపడా ఆహారాన్ని (Moderate Diet) తీసుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా తాజా పండ్లు (Fruit), కూరగాయలు (Vegetables), తృణధాన్యాలు (Grains), చేపలు (Fish) వంటి తక్కువ కొవ్వు గల ఆహారాన్ని తీసుకోండి. వీటిలో కూడా కొవ్వు, చక్కెర ఉన్నప్పటికీ, అది తక్కువ మొత్తంలోనే ఉంటుంది. వీటితో పాటు మీ ఆహారంలో పిండి పదార్థాలు (carbohydrates) లేదా ప్రోటీన్ (Protein) లేదా లాక్టోస్ (Lactose) వంటివి సమతుల్యంగా ఉండేట్లు చూసుకోండి.

    వెంటనే పడుకోవద్దు..

    ఆహారం తిన్న వెంటనే పడుకోకూడదు (Don’t sleep immediately after eat). ఆహారం తిన్నాక కనీసం రెండు గంటల పాటైనా మెలకువగా ఉండి ఏదైనా పనులు చేస్తే బెటర్. కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు గానీ, సుగంధ ద్రవ్యాలతో కూడిన ఆహారాలను గానీ ఎక్కువగా ముట్టుకోకూడదు. ఒకానొక అధ్యయనం ప్రకారం, సుగంధ ద్రవ్యాల ఆహారాలు త్రేన్పులకు కారణంగా ఉంటున్నాయని తెలిసింది. కొన్ని పండ్లు, ముఖ్యంగా ఫైనాఫిల్, నారింజ, గ్రేప్ ఫ్రూట్, నిమ్మకాయ (lemon), టమాట, ఉల్లిగడ్డ (Onion) మొదలైనవి పక్కన పెట్టడమే మంచిది.



    కొందరికి తరచూ గుండెల్లో మంట (Pain in Heart) వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి.. దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం.. రెండోది సరైన మందులు (Medicines) వాడటం. ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ తినడం కాకుండా.. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఇది రోగస్తులే (patients) కాకుండా అందరూ కూడా ఈ శైలి అలవరచుకుంటే మంచిదే.  ఏ ఏ ఆహార పదార్దాలు తింటే గుండెల్లో మంట వస్తుందో గమనించి వాటికి దూరంగా ఉండాలి. ఇక ఈ మార్పులతో పాటు వైద్యుని సంప్రదించిన తగిన మందులు వాడాలి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Health Tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు