DO YOU FACING BAD SMELL PROBLEM IN YOUR MOUTH REGULARLY THEN YOU SHOULD FOLLOW THIS SIMPLE TIPS PRV
Mouth Smell: నోటి దుర్వాసన ఎక్కువగా ఉందా? అయితే నోటి శుభ్రత ఎలా చేసుకోవాలి?
ప్రతీకాత్మక చిత్రం
నోటి దుర్వాసన సమస్య చాలా మందిని ఇబ్బందులు పెడుతున్నది. కొందరికి ఏం తిన్నా తినకపోయినా నోటి దుర్వాసన వస్తుంటుంది. అయితే అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఈ చిట్కాలు పాటిస్తే బెటర్.
నోటి శుభ్రత లేకపోతే దంతాలు క్షీణిస్తాయి. పుచ్చిపోతాయి. దీంతో దంతాలను తీసేయాల్సి (remove) వస్తుంది. చిగుళ్ల సమస్యలు వస్తాయి. దంతాలు బలహీనంగా (weak) మారుతాయి. కనుక దంతాలను రోజూ తోముకోవాలి. ఉదయం, రాత్రి భోజనం తరువాత దంతాలను తోముకుంటే ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అయితే చాలామందికి నోటి దుర్వాసన (Bad breath from mouth) వస్తుంది. ఈ నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చినా, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వలనే ఈ సమస్య తలెత్తుతుంది. కొంతమందికి అనారోగ్య పరిస్థితుల వల్ల తరచుగా నోటి నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో వారు ఎవ్వరితో సరిగ్గా మాట్లాడలేరు. బయటికి రావాలంటే ఇబ్బందిపడుతారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దుర్వాసన నుంచి రక్షించుకోవచ్చు.
నోటి దుర్వాసన (Mouth smell) తక్కువ నీళ్లు తీసుకునే వారిలో సమస్య ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా నీళ్లు (Much water) తాగితే నోటిలో ఉండే బ్యాక్టీరియా బయటకు వచ్చేస్తుంది. నోటిని ప్రెష్‌గా ఉంచుతుంది. నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే వెంటనే నీరు తాగండి. వీలుంటే నీటిలో నిమ్మకాయ (lemon) రసం వేసి తాగితే ఇంకా మంచిది.
భోజనం చేశాక 30 నిమిషాల తరువాత గ్రీన్ టీ తాగండి. ఇందులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేస్తాయి. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది.
భోజనం చేశాక ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకుని చాలా సేపు అలాగే చప్పరించాలి. దీంతో నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. లవంగాల్లో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేసి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.
పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి. భోజనం చివర్లో కచ్చితంగా పెరుగన్నంతో తినడం అలవాటు చేసుకుంటే నోట్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. ఫలితంగా నోరు దుర్వాసన రాదు.
ఆహారంలో క్యాప్సికమ్, బ్రొకోలిలను భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ సి క్రిములను చంపేస్తుంది. దీంతో నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లను తింటుంటే నోటి దుర్వాసన రాదు. దంత సమస్యలు కూడా పోతాయి. చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి.
భోజనం చేసిన తరువాత టీస్పూన్ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గి, నోరు ఫ్రెష్ అవుతుంది. భోజనం చేశాక ఒకటి రెండు పుదీనా లేదా తులసి ఆకులను అలాగే పచ్చిగా నమిలేయాలి. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.