Home /News /life-style /

DO YOU EAT PAAN THEN YOU NEED TO KNOW THE SIDE EFFECTS OF PAAN PRV

Side effects of Paan: కిళ్లీలు ఎక్కువగా తింటున్నారా? తస్మాత్​ జాగ్రత్త..! మీరు ప్రమాదంలో ఉన్నట్లే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాలం గడిచే కొద్ది తాంబూలాన్ని కొత్తగా పాన్ లేదా కిళ్లీల రూపంలో తీసుకువచ్చారు. కొత్త కొత్త పదార్థాలు కలిపి తయారు చేస్తున్నారు.ఇదే అనారోగ్యానికి దారి తీస్తుంది. అయితే ఈ కిళ్లీలు, తమలపాకుల(betel leaves)తో ఎంత వరకు తీసుకోవాలి.. పాన్​లు అనారోగ్యానికి ఎంత వరకు దారి తీస్తాయో ఓ సారి తెలుసుకుందాం

ఇంకా చదవండి ...
  తాంబూలం(Paan) భారత సంస్కృతిలో ఒక భాగం. భోజనం తర్వాత(after food) తాంబూలం లేదా కిళ్లీ (Paan) లేకపోతే ఏదో వెలితిగా భావిస్తారు. ఎందుకంటే తిన్నది అరగాలంటే అది తప్పక ఉండాల్సిందేనని వారి అభిప్రాయం. అయితే ఈ కిళ్లీలు తరతరాలుగా వస్తున్నా.. సంస్కృతిలో భాగమైనా.. వాటితో ఆరోగ్యానికి (health) ముప్పే అంటున్నారు నిపుణులు(experts). అవును. కిళ్లీలు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయంటా. వాటిలో వాడే పదార్థాలు మన శరీరం(body)లో చేరి అనారోగ్య సమస్యలు తెచ్చిపెడ్తాయట. ముఖ్యంగా నోటిలో అనారోగ్యాన్ని కారణం అవుతుందట. నోటిలో ఉన్నసున్నితమైన చర్మం(skin) గట్టిగా మారుతుందట. నోరు తెల్లగా అవుతుందంటా. ఆ తర్వాత నోరంతా మంటగా ఉంటుందట. నోరు రోజురోజుకు మూసుకుపోయే(close) అవకాశాలు ఎక్కువట. అనంతరం ఆహారం తీసుకోవడం కూడా కష్టమవుతుందంట. ఎంతలా అంటే ఈ పాన్​(paan)లతో ఏకంగా క్యాన్సర్​ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందట. అంతేకాదు వీటిని రెగ్యులర్​గా తీసుకునే వారికి ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. తమలపాకు (betel leaf)లతో కలిపి వాడే సున్నం అనారోగ్యానికి మూల కారణం అవుతుందని అంటున్నారు. అయితే పూర్వకాలంలో తమలపాకులు పల్లెంలో పెట్టి మరీ ఇచ్చేవారు కదా అని మీకు అనుమానం రావచ్చు. అవును కరెక్టే. కానీ, అప్పటి రకాలు ఇప్పుడు ఎక్కువగా లేవు, పాన్​లు, కిళ్లీ(paan)లు అంటూ రకరకాలుగా  కృత్రిమ పదార్థాలు జోడించి తయారు చేస్తున్నారు. ఇదే అనారోగ్యానికి దారి తీస్తుంది. అయితే ఈ కిళ్లీలు, తమలపాకుల(betel leaves)తో ఎంత వరకు తీసుకోవాలి.. పాన్​లు అనారోగ్యానికి ఎంత వరకు దారి తీస్తాయో ఓ సారి తెలుసుకుందాం..

  కాలం గడిచే కొద్ది తాంబూలాన్ని కొత్తగా పాన్(paan) లేదా కిళ్లీల రూపంలో తీసుకువచ్చారు. కొత్త కొత్త పదార్థాలు కలిపి తయారు చేస్తున్నారు. దీంతో ఈ రకమైన కిళ్లీ లేదా పాన్​లు ఎక్కువగా తినేవారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు తమలపాకులపై రాసిన సున్నమే(Lime) కారణం కావచ్చంటున్నారు. వక్కలు తినేవారికి దీర్ఘకాల కిడ్నీ జబ్బులు వస్తున్నాయన్నారు. వీరిలో విటమిన్​ డీ స్థాయిలు కూడా పడిపోతూ ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు. ఇంకా మధుమేహ రోగులైతే వెంటనే పాన్​ మానేయాలని లేకుంటే రోగం ముదురుతుందని సూచిస్తున్నారు. యువతలో బెల్లీ ఫ్యాట్​ కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు.

  ఎవరెవరు తీసుకోవచ్చు..

  తమలపాకు లో ఉన్న ఆరోగ్య రహస్యాలు మనకు తెలిసినవే. అయితే ఆకులోకి వక్క, సున్నం తో పాటు కాసింత జాజికాయ, పచ్చ కర్పూరం, కుంకుమ పుష్పం, యాలకుల పొడి, కస్తూరి మొదలైనవి వాడతారు. ఇవన్నీ ఆయుర్వేద పరంగా ఆరోగ్యాన్ని చేకూర్చే వి. ఎముకల(bones)ను దృఢం(strong)గా ఉంచడానికి ఉపయోగపడే కాల్షియం విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి సమృద్ధిగా మన శరీరానికి అందుతాయి. తాంబూలం వల్ల జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా ఉంటుంది. పాన్ లేదా కిల్లి లను తాంబూలమనే చాలామంది అనుకుంటారు. అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం.. పాన్ తయారీలో ఆకు వక్క సున్నం కాకుండా ఇతర పదార్థాలు వాడుతారు. కృత్రిమ రంగులు, కృత్రిమ సువాసనలు జతచేసి, చూడటానికి కళాత్మకంగా చేసినా ఆరోగ్యానికి పాన్​లు అంత మంచివి కాదు. స్వీట్ పాన్(sweet paan), డ్రై ఫ్రూట్ పాన్, చాక్లెట్ పాన్(chocolate paan) అంటూ రకాలు తీసుకువచ్చినా మన సంప్రదాయమైన తాంబూలం ఇచ్చిన ఫలితాలను మాత్రం ఇవ్వలేవు. రోజుకు 5 నుంచి 10 తమలపాకులను తినే అలవాటు రెండేళ్ల కంటే ఎక్కువ ఉంటే .. డ్రగ్స్ మాదిరిగా వాటికి బానిసలవుతారట. అలాగే అధిక రక్తపోటు గల వ్యక్తులు కూడా తాంబూలానికి దూరంగా ఉండాలి. తమలపాకు తిన్న తర్వాత పొగ తాగినా లేదా పొగాకును కలిపి తిన్నా సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ లాంటి ప్రమాదకర నోటి వ్యాధులు వస్తాయి. ఇది నోటి క్యాన్సర్ సంబంధిత సంకేతం. కాబట్టి .. తమలపాకులను మితంగా తీసుకుంటే ఔషధం, అతిగా తీసుకుంటే విషం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ayurveda health tips, Best health benefits, Life Style, Meat, PAN, Side effects

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు