Home /News /life-style /

DO U SUFFERING FROM HAIR FALL PROBLEM THEN MAKE YOUR HAIR STRONG AND SILKY WITH THIS CURD PACK PRV

Hair loss: జుట్టు సమస్య ఎక్కువగా బాధిస్తోందా? అయితే ఈ పెరుగు ప్యాక్​తో మీ జుట్టును బలంగా, సిల్కీగా చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జుట్టు రాలిపోతుండటాన్ని( hair loss) చూసి తట్టుకోలేం. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు.

    జుట్టు రాలిపోతుండటాన్ని( hair loss) చూసి తట్టుకోలేం. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా  (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది.

    జుట్టును మృదువుగా చేయడానికి..

    జుట్టును మృదువుగా చేయడానికి మనం ప్రతిరోజూ కూడా పెరుగు (curd) కలిపిన హెయిర్ ప్యాక్‌ (hair pack)ను వాడవచ్చు. ఈ హెయిర్‌ప్యాక్‌ను జుట్టుకు వాడటం వల్ల జుట్టుకు మంచి బలం ఇంకా నల్లటి రంగు అనేది పెరుగుతుంది. ఇది మీ జుట్టు  మృదుత్వాన్ని బాగా పెంచుతుంది. అలాగే జుట్టుని చక్కని సిల్కీ హెయిర్‌ (silky hair)గా చేస్తుంది. ప్రతి రోజూ కూడా పెరుగు జుట్టుకి అప్లై చేస్తే జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. లేదా  వారానికి కనీసం రెండు రోజులు ఈ ప్యాక్ ని జుట్టుకి మనం అప్లై చేయవచ్చు.ఇలా చేస్తే జుట్టు మృదువుగా ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చుండ్రు నివారణకు కూడా పెరుగు హెయిర్‌ప్యాక్ ఎంతో మంచిది.

    జుట్టు ఎంతో బలంగా ఉంటుంది..

    ఈ ప్యాక్ మన జుట్టుకు అప్లై చేసినప్పుడు జుట్టు ఎంతో బలంగా ఉంటుంది. ఇలా వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ని ఉపయోగించడం ద్వారా మీ జుట్టు కుదుల్లనేవి చాలా గట్టిగా అవుతాయి.ఇక అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అనేక రకాల జుట్టు సమస్యలను పరిష్కరించడానికి ఈ హెయిర్ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. ఇది జుట్టు రాలే పూర్తిగా తగ్గిస్తుంది.ఇంకెందుకు ఆలస్యం రోజు ఈ ప్యాక్ వేసుకోండి. జుట్టు సమస్యలను తగ్గించుకోండి.

    జుట్టు సమస్యలను శాశ్వతంగా వదిలించుకోవడానికి మనం ప్రతిరోజూ పెరుగు హెయిర్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. అలాగే చుండ్రును కూడా పూర్తిగా నివారించడానికి ఈ హెయిర్‌ప్యాక్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. అందుకే జుట్టుకి తరచుగా పెరుగుతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ ని వాడండి. జుట్టు మృదువుగా మాత్రమే కాకుండా చుండ్రు సమస్య కూడా ఈజీగా పోతుంది. అలాగే జుట్టు రాలే సమస్యని కూడా తగ్గించుకోవాలంటే మనం ప్రతిరోజూ పెరుగు హెయిర్ ప్యాక్ ఉపయోగించవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Hair Loss

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు