Memory:  డైలీ చాక్లెట్లు తినేవారికి తెలివి ఎక్కువుంటుందా? ఇందులో నిజమెంత?

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది గుర్తుంచుకోవాల్సిన విషయాలు మరిచిపోతున్నారు. చిన్నచిన్న లెక్కలకు కూడా కంప్యూటర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే జ్ఞాపకశక్తి ( Memory) మెండుగా ఉన్నవాళ్లకే భవిష్యత్తు ఉంటుందనేది జగమెరిగిన సత్యం. చాలా వరకు తల్లిదండ్రులు తమ పిల్లలు (children) సరిగా చదవడం లేదని ఫిర్యాదులు చేస్తుంటారు. అయితే ఎవరికైనా సరైన పోషకాలు అందిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

  • Share this:
    టెక్నాలజీ(Technology) పెరిగిపోతోంది. కంప్యూటర్లలో మెమొరీలు వచ్చేశాయి. వాటి పరిధీ పెరిగిపోతోంది. కేబీ, ఎంబీ, జీబీ, టెరా బైట్లంటూ మెమొరీల పరిధులు ఎక్కువయిపోతున్నాయి. సూపర్ కంప్యూటర్లూ వచ్చేశాయి. అయితే ఇవి ఎంతగా ఉన్నా.. వీటిని సృష్టించింది మాత్రం మానవుడే అని మరిచిపోవద్దు. అయితే ఇపుడు, భవిష్యత్తులో జ్ఞాపకశక్తి (Memory) అనేది ప్రధాన పాత్ర పోషించక మానదు. గుర్తుంచుకోవడం (remembering) అనేది వరం కాదు. ఇది ఒక సాధన. అయితే చాలామంది గుర్తుంచుకోవాల్సిన విషయాలు మరిచిపోతున్నారు. చిన్నచిన్న లెక్కలకు కూడా కంప్యూటర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే జ్ఞాపకశక్తి ( Memory) మెండుగా ఉన్నవాళ్లకే భవిష్యత్తు ఉంటుందనేది జగమెరిగిన సత్యం. చాలా వరకు తల్లిదండ్రులు తమ పిల్లలు (children) సరిగా చదవడం లేదని ఫిర్యాదులు చేస్తుంటారు. అయితే ఎవరికైనా సరైన పోషకాలు అందిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.  ఇంతకీ చాక్లెట్లు తినేవారు కొంచెం చురుగ్గా ఉంటారట. ఇది ఎంతవరకు నిజం. అనేది తెలుసుకుందాం. అంతేకాకుండా జ్ఞాపకశక్తికి ఏ ఆహార పదార్థాలు (Food Items) తీసుకుంటే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

    డార్క్ చాక్లెట్ (dark chocolate)లు తినేవారిలో తెలివి ఎక్కువుంటుందట. దానిలో కూడా కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్ పాటు కోకో పౌడర్ ఫ్లేవనాయిడ్స్ కూడా పుష్కలంగా లభించడం వల్ల, ఇది మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో రెగ్యులర్​గా చాక్లెట్ ​(Chocolate)లు తినేవారికి మెదడు చురుకుగా పనిచేస్తుందట. గుమ్మడికాయ విత్తనాల లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల, ఇది మన శరీరంతో పాటు మెదడుని కూడా ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఐరన్,జింక్ తో పాటు కాపర్  అధికంగా ఉంటాయి.

    చేప(fish)లు జ్ఞాపకశక్తికి బాగా ఉపయోగపడుతాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటు సాల్మన్, ట్రౌట్,  సార్డినెస్ అధికంగా ఉంటాయి. మెదడులో 60 శాతం కొవ్వు తయారయ్యే ఈ కొవ్వు లో సగం ఒమేగా త్రీ కొవ్వులు ఉంటాయి. అంతేకాకుండా వయస్సు ద్వారా వచ్చే మానసిక క్షీణత వల్ల అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. దీన్ని నివారించడానికి చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు తోడ్పడతాయి. ఇక మెదడు పని తీరును మెరుగు పరచుకోవచ్చు.

    గుడ్లు(Eggs) జ్ఞాపకశక్తికి చాలా ఉపయోగపడుతాయి. వీటిలో విటమిన్ బి 6 విటమిన్ బి 12 తోపాటు కోలిన్ తో నిండిన గుడ్డు మెదడు ఆరోగ్యంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. ఇంకా ఇవే కాక గ్రీన్ టీ, నారింజ, పసుపు కూడా మెదడు పని తీరును పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి.

    ఉదయాన్నే చాలా మంది కాఫీ (coffee) తాగడాన్ని ఇష్టపడతారు. ఈ కాఫీ లో ఉండే కెఫిన్, యాంటి ఆక్సిడెంట్లు. ఇది మన మెదడు చురుకుగా  పని చేయడానికి ఉపయోగపడుతాయి. బ్రోకలీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో విటమిన్ కె కూడా చాలా ఎక్కువ. కొవ్వులో కరిగే విటమిన్, మెదడు కణాలతో దట్టంగా నిండిన ఒమేగా 3 కొవ్వు తత్వాన్ని ఏర్పరచడానికి  అవసరమవుతుంది.
    Published by:Prabhakar Vaddi
    First published: