Sleep tips: రాత్రిళ్లు ప్రశాంతమైన నిద్ర కోసం ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది?

ప్రతీకాత్మక చిత్రం

సరైన నిద్ర (good sleep)తో మరుసటి రోజు నూతనోత్తేజంతో పనిచేసేందుకు కావాల్సిన శక్తినిస్తుంది. జీర్ణక్రియ (digestive) నుండి మీ మానసిక స్థితి వరకు అన్నింటిపై నిద్ర  ప్రభావాల్ని చూపిస్తుంది. అందువల్ల మీ మెదడు సరిగ్గా పనిచేయడానికి తగినంత నిద్ర తప్పనిసరి (compulsory).

  • Share this:
    leబిజీ లైఫ్‌స్టైల్‌లో అనేక మంది సరిగ్గా నిద్ర (sleep) కూడా పోవడం లేదు. పని ఒత్తిడి, మానసిక చికాగుల కారణంగా చాలా మంది నిద్రలేమితో భాదపడుతున్నారు. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. మానవ శరీరం సరైన రీతిలో పనిచేయాలంటే కంటినిండా నిద్ర (sleep) ఎంతో అవసరం. నిద్ర వల్ల శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది. అంతేకాక వారు రోజువారీ కార్యకలాపాలను (daily routines) సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. సరైన నిద్ర (good sleep)తో మరుసటి రోజు నూతనోత్తేజంతో పనిచేసేందుకు కావాల్సిన శక్తినిస్తుంది. జీర్ణక్రియ (digestive) నుండి మీ మానసిక స్థితి వరకు అన్నింటిపై నిద్ర  ప్రభావాల్ని చూపిస్తుంది. అందువల్ల మీ మెదడు సరిగ్గా పనిచేయడానికి తగినంత నిద్ర తప్పనిసరి (compulsory).

    మినరల్స్‌, అమినో యాసిడ్స్‌..

    అలాగే కంటి నిండ నిద్ర పోవాలంటే.. ఓట్స్‌ (oats)కు స్థానం కల్పించాలని నిపుణులు అంటున్నారు. మనం తినే ఆహారంలో ఓట్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఈ ఓట్స్‌ లో ఉండే విటమిన్స్‌ (vitmins), మినరల్స్‌, అమినో యాసిడ్స్‌ మరియు మెలటోనిన్‌ మన మైండ్‌ ను ప్రశాంతతకు తీసుకుపోతాయి. దీని కారణంగా మంచి నిద్ర అందుతుంది.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    రాత్రి సమయంలో... మనం పడకునే సమయంలో రోజుకు రెండు బాదం (almonds) పలుకులు తింటే హాయిగా నిద్ర పోవచ్చు. బాదంలో ఉండే మెగ్నీషియం నిద్ర పట్టేలా చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే... రోజు ఒక అరటి పండు తింటే.. నిద్ర లేమి సమస్యను దూరం చేయవచ్చు.

    వాకింగ్‌..

    పడుకునే ముందు వాకింగ్‌ (walking) మరియు ప్రతి రోజూ యోగా చేస్తే నిద్ర బాగా పడుతుంది. గర్భిణీల్లో నిద్ర లేమి సమస్య తలెత్తినప్పుడు... పాలల్లో కాస్త నెయ్యి (butter) వేసి.. కలిపి తాగడం కారణంగా పోషకాలు అందటమే కాకుండా... నిద్ర లేమి సమస్యకు కూడా చెక్‌ పెట్టవచ్చు. గోరువెచ్చని పాల (lukewarm water)లో ఒక స్పూన్‌ నెయ్యి వేసుకుని తాగడం కారణంగా మన శరీరంలో ఒత్తిడి తగ్గును. అలాగే అజీర్తి సమస్యలు మన దరికి చేరవు. అంతేకాదు... శృంగార సమస్యల (sexual problems)తో పాటు నిద్ర లేమి సమస్యలకు చెక్‌ పెడుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)



    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

    26 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లూయన్సర్ల డేటా లీక్​.. గుర్తించిన సెక్యూరిటీ పరిశోధకులు
    Published by:Prabhakar Vaddi
    First published: