Home /News /life-style /

DO STOMACH PROBLEMS START IMMEDIATELY AFTER EATING THEN FOLLOW THESE TIPS TO AVOID THE PROBLEM PRV

Health tips: తిన్న వెంటనే కడుపులో సమస్యలు మొదలవుతున్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించి సమస్యను దూరం చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆహారం తిన్నాక కడుపులో పలు సమస్యలు వస్తుంటాయి. అజీర్తి వలన వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి తదితరాలు వస్తుంటాయి. కాబట్టి తిన్న ఆహారం సమయానికి జీర్ణమవడానికి ఇంట్లోనే మంచి చిట్కాలు ఫలితాలనిస్తాయి.

ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం కాపాడుకోవడమే గగనంలా మారిపోయింది. పని, ఆందోళన, కష్టాలు మన తిండి సమయాలనూ మార్చేస్తాయి. ఏ పూట తింటారో తెలియదు. ఏ సమయాల్లో తింటారో తెలియదు. అందుకే చాలామందికి జీర్ణ సమస్యలు (digestive problems) వస్తాయి. ఎన్నో అనారోగ్యాల పాలవుతారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి జేబులు గుల్ల చేసుకుంటారు. మళ్లీ అదే జీవితంలోకి అడుగుపెడుతారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సమస్యలు (digestive problems) తెచ్చుకోకూడదు. పోషకాలు బాగా ఉండే ఆహారం(food) తినండి. పుష్కలంగా నీరు తాగండి(drink). అయితే జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి కావలసిన కొన్ని ఆహార పదార్థాలు విరివిగానే లభిస్తాయి. నేటి కాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య అజీర్తి.

తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావట్లేదు. తిన్నది తిన్నట్లే కడుపులో అలా ఉంటుంది. దాన్ని ఎలా అరిగించుకోవాలా అని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆహారం జీర్ణం కాకపోతే ప్రమాదం. గ్యాస్, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. చాలామందికి ఆహారం తిన్నాక కడుపులో పలు సమస్యలు వస్తుంటాయి. కాబట్టి తిన్న ఆహారం సమయానికి జీర్ణమవడానికి ఇంట్లోనే మంచి చిట్కాలు ఫలితాలనిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం..

పొగ త్రాగడం..

సాధారణంగా  కొన్ని రకాల ఆహార పదార్థాలను (food) ఎక్కువగా తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తుతుంది. పొగ త్రాగటం, మద్యపానం, గుట్కాలు, తీసుకునేవారిలో అజీర్తి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడేవారు అధిక ఆమ్లగుణం కలిగిన (సిట్రస్‌ పండ్లు) నారింజ, బత్తాయి టమోటా వంటి ఆహారాన్ని  తక్కువగా తీసుకోవాలి. కెఫిన్‌ కలిగి ఉన్న ఆహారాలు, పానీయాలను తగ్గించాలి.

ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు లేదా ఎసిడిటీ బాధిస్తున్నప్పుడు కాస్త జీలకర్రను నమలడం వల్ల ఉపశమనం కలుగుతుంది. కరివేపాకు కారంపొడికి అజీర్తిని తగ్గించే గుణం ఉంది. కరివేపాకు (curry leaf)ను నీడలో ఎండబెట్టి, కొద్దిగా వేయించి, ఉప్పు, కారం కలిపితే కరివేపాకు కారంపొడి తయారవుతుంది.

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

టేబుల్‌ స్పూను జీలకర్రను శుభ్రంగా కడిగి, 150 మి.లీ. నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగి, జీలకర్రను తినాలి. క్రమం తప్పకుండా నెల రోజులపాటు ఇలా చేయడం వల్ల అజీర్తి, మలబద్ధకం పూర్తిగా నయమవుతాయి.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..




ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Food, Health problem, Health Tips, Life Style, Stomach Pain

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు