హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Mask side effects: మొటిమలు ఉన్నవారు మాస్కు పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త .. మొటిమలు పెరిగే అవకాశం.. ఇలా చేస్తే సేఫ్​ అయినట్లే

Mask side effects: మొటిమలు ఉన్నవారు మాస్కు పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త .. మొటిమలు పెరిగే అవకాశం.. ఇలా చేస్తే సేఫ్​ అయినట్లే

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం, రాత్రి కర్ఫ్యూ విధించాలని, జనం పెద్ద సంఖ్యలో గుమికూడకుండా చూడాలని సూచించారు. జిల్లాల్లో నమోదౌతున్న డెల్టా, ఒమైక్రాన్ కేసులపై దృష్టి సారించాలని సూచించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లాలని, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచుకోవడంతో పాటు మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆక్సిజన్ పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం, రాత్రి కర్ఫ్యూ విధించాలని, జనం పెద్ద సంఖ్యలో గుమికూడకుండా చూడాలని సూచించారు. జిల్లాల్లో నమోదౌతున్న డెల్టా, ఒమైక్రాన్ కేసులపై దృష్టి సారించాలని సూచించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లాలని, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచుకోవడంతో పాటు మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆక్సిజన్ పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

మాస్కులు వాడటం వల్ల మన ముఖంలో మార్పులు రావచ్చట. అందులోనూ ఇంతకుముందు ముఖంపై మొటిమలు ఉన్నవారు మాస్కులు ధరించేటపుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే మిగతా వారితో పోలిస్తే వారికి ఎక్కవు సమస్యలు రావచ్చు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

అందం (beauty) ప్రతి ఒక్కరూ కోరుకునేదే. అంతర సౌందర్యం (beautiness) అంటే వేరులే కానీ, బాహ్య సౌందర్యం పరిస్థితులు(situations), పరిసరాలు, అలవాట్లను బట్టి మారుతూ ఉంటుంది. ముఖంలో తెలియకుండానే మార్పులు వస్తుంటాయి. కరోనా కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. దీంతో వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కు(mask) పెట్టుకోండి, చేతులను శానిటైజర్​తో శుభ్రం చేసుకోండి అని ప్రభుత్వం గంటా బజాయించి మరీ చెబుతోంది. తరచూ శానిటైజర్‌ వాడే కొందర్లో అలర్జీ(allergy)లు తలెత్తుతూ ఉంటాయి. చర్మం పొడిబారుతూ ఉంటుంది. ఆల్కహాల్‌తో తయారయ్యే శానిటైజర్‌ వల్ల చర్మ(skin)పు అలర్జీలు తలెత్తేవారు శానిటైజర్లకు బదులుగా చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు వాడుకోవాలి. శుభ్రం చేసుకున్న ప్రతిసారీ మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకుంటూ ఉండాలి. అలాగే వేర్వేరు శానిటైజర్లకు బదులుగా ఒకే రకమైన శానిటైజర్‌నే వాడుకోవాలి. మాస్కు(mask) లేకుండా బయటికి వస్తే జరిమానాలు కూడా విధిస్తోంది. అంతా బాగుంది కానీ, ఈ మాస్కులు వాడటం వల్ల మన ముఖంలో మార్పులు రావచ్చట. అందులోనూ ఇంతకుముందు ముఖంపై మొటిమలు ఉన్నవారు మాస్కులు ధరించేటపుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే మిగతా వారితో పోలిస్తే వారికి ఎక్కవు సమస్యలు రావచ్చు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం..

మాస్కు ఉతకడం తప్పనిసరి..

ముఖంపై మొటిమలు(pimples) ఉన్నవాళ్లు నిరంతరంగా మాస్క్‌ ధరించడం వల్ల మొటిమలు మరింత పెరుగుతూ ఉంటాయి. మాస్క్‌ను శుభ్రం చేయకుండా దాన్నే పదే పదే వాడడం, ముఖాన్ని తరచుగా శుభ్రం చేసుకోకపోవడమే అలా పెరగడానికి కారణం. అలాగే మాస్క్‌ను శుభ్రం చేసుకునే విధానం, ధరించే విధానం కూడా ముఖ్యమే! మాస్క్‌ను కొందరు డెట్టాల్‌, డిటర్జెంట్‌లో నానబెట్టి ఉతికి శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ మాస్క్‌ను సబ్బునీటితో ఉతికి(wash), ఎండలో ఆరబెట్టి వాడుకుంటే సరిపోతుంది. ఒకటే మాస్క్‌ను ఎక్కువ రోజులు వాడుతూ ఉండడం కంటే రోజుకొకటి చొప్పున డిస్పోజబుల్‌ మాస్క్‌లను వాడుకోవడం అన్నివిధాలా క్షేమం. ఒకే మాస్క్‌ను శుభ్రం చేయకుండా పదే పదే వాడడం వలన, చర్మపు నూనెలు ఇంకిపోయి, మొటిమలు(pimples) తలెత్తే అవకాశాలు ఉంటాయి.

ఎన్‌ 95 మాస్క్‌ను వాడేవారు ఒకసారి మాస్క్‌ను వాడిన తర్వాత 4 రోజుల పాటు దాన్ని వాడకుండా కవర్‌లో ఉంచాలి. ఆ తర్వాతే వాడుకోవాలి. ఇలా ఒక ఎన్‌ 95 మాస్క్‌ను నాలుగు సార్లు వాడుకోవచ్చు. అంతే తప్ప ఈ రకం మాస్క్‌ను ప్రతి రోజూ వరుసగా నాలుగు రోజుల పాటు, నాలుగు సార్లు వాడుకోవడం సరి కాదు. క్లాత్‌ మాస్క్‌ను తప్పనిసరిగా ప్రతి రోజూ శుభ్రం చేసుకోవాలి. అంతే తప్ప దాని మీద శానిటైజర్‌ స్ర్పే చేసి వాడుకోకూడదు. మొటిమల సమస్య ఉన్నవాళ్లు శాలిసిలిక్‌ యాసిడ్‌ సీరంను ముఖానికి అప్లై చేసిన తర్వాతే మాస్క్‌ ధరించాలి. ఇలా చేస్తే మొటిమలు పెరగకుండా ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మొటిమలు ఎక్కువ పెరగవు.

First published:

Tags: Beauty tips, Face mask, Health care, Life Style, Mask

ఉత్తమ కథలు