Home /News /life-style /

DO PEOPLE WITH DIABETES HAVE PROBLEMS EATING APPLES AND WHAT FRUITS SHOULD NOT BE TAKEN PRV

Diabetes: మధుమేహం ఉన్నవారు ఆపిల్​ తింటే సమస్యలు వస్తాయా? ఏ పండ్లు తీసుకోకూడదు?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

మధుమేహ వ్యాధి గుడ్డితనం, గుండె సంబంధ వ్యాధులు వంటి అతి ప్రమాదకర జబ్బులతో ముడిపడి ఉంది. కనుక షుగర్ వ్యాధిని సరిగా నయం చేసుకోకపోతే ఆ ప్రమాదకర జబ్బులకు లోనయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, మధుమేహ వ్యాధిని, అది ముదరక మునుపే, ముందుగానే గుర్తించి ఆహారం, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే అరికట్టవచ్చు. అందులో ముఖ్యంగా ఆహారంలో కొన్ని పండ్లు తీసుకోవడంతో మధుమేహాన్ని కొద్దిగా అదుపులో పెట్టొచ్చు.

ఇంకా చదవండి ...
    రక్తంలో నిరంతరం పెరిగిపోతుండే చక్కెర స్థాయిలు శరీరంలోని ఇతర ముఖ్య అవయవాలకు చేటు చేస్తాయి. అందుకే మధుమేహం (diabetes) మరింత విపరీతమయ్యే పరిస్థితికి తెచ్చుకోవద్దు అంటారు వైద్యులు(doctors). మధుమేహం వ్యాధి (disease) స్త్రీ పురుషులెవరికైనా, ఏ వయసు వారికైనా రావచ్చు. ఈ వ్యాధినే డయాబెటీస్ అని షుగర్(sugar)​ వ్యాధి అని కూడా పిలుస్తారు. రక్త ప్రసరణలో చక్కెర శాతం ఎక్కువ అవడాన్ని బట్టి ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధిని టైపు1 టైపు 2 అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇంకా చిన్నపిల్లలు(children), గర్భిణీలకు వచ్చే షుగర్ వ్యాధి,  ప్రీ డయాబెటీస్ అనే మరో మూడు రకాలుగా కూడా ఈ వ్యాధిని వర్గీకరించారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు వైద్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధుమేహ వ్యాధి గుడ్డితనం, గుండె సంబంధ వ్యాధులు వంటి అతి ప్రమాదకర జబ్బులతో ముడిపడి ఉంది. కనుక షుగర్ వ్యాధిని సరిగా నయం చేసుకోకపోతే ఆ ప్రమాదకర జబ్బులకు లోనయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, మధుమేహ వ్యాధిని, అది ముదరక మునుపే, ముందుగానే గుర్తించి ఆహారం, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే అరికట్టవచ్చు. అందులో ముఖ్యంగా ఆహారంలో కొన్ని పండ్లు తీసుకోవడంతో మధుమేహాన్ని కొద్దిగా అదుపులో పెట్టొచ్చు. అవేంటంటే..

    పండ్లలో ఆపిల్(apple), బొప్పాయి వంటివి డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తాయి. ఆపిల్ చక్కెర స్థాయిల(sugar levels)ను పెంచేస్తుందనే కలవరం అస్సలు అవసరం లేదు. ఆపిల్‌లో విటమిన్-సి, ఫైబర్‌తోపాటు అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పైగా రుచి కూడా ఎంతో బాగుంటుంది. కాబట్టి.. తీపి తినేందుకు భాగ్యం లేదని బాధపడేవారు ఆపిల్ ద్వారా ఆ కోరిక తీర్చుకోవచ్చు. ఆపిల్‌లో నీటి శాతం కూడా ఎక్కువే. ఆపిల్ తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. పైగా ఈ పండులో క్యాలరీల శాతం కూడా తక్కువే. అయితే, ఆపిల్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కదా.. దాని వల్ల చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది కదా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేస్తారు. అది కూడా నిజమే. కానీ, ఆపిల్‌లో ఉండే ఫైబర్ ఆ రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఫలితంగా మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

    తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ ఇష్టమైన పండ్లలో ఒకటి. అయితే, మీరు ఈ పండును మీ ఆహారంలో నేర్చుకుంటే, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని నిరంతరం పర్యవేక్షించాలి. 100 గ్రాముల తరిగిన జామలో 9 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి, అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మితంగా తినడం ఉత్తమ ఎంపిక. అయితే డయాబెటిస్​ ఉన్నవారు మామిడి, ద్రాక్ష, సీతాఫలం, సపోటా తదితర పండ్లను దూరంగా పెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Apple, Diabetes, Health benefits, Life Style

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు