హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

పౌరులకు ప్రభుత్వం హెచ్చరిక..ఆ టైంలో మాత్రం జుట్టుకి కండీషనర్ లు వాడొద్దు

పౌరులకు ప్రభుత్వం హెచ్చరిక..ఆ టైంలో మాత్రం జుట్టుకి కండీషనర్ లు వాడొద్దు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hair Conditioner : ఈ  ఏడాది ఫిబ్రవరి నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం(Russia-Ukraine War) కొనసాగుతోంది. అయితే ఉక్రెయిన్ పై యుద్ధంలో తమ దేశ సైనిక దళాలు క్రమంగా తోక ముడుస్తున్నట్టు తెలియడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ లో అసహనం పెరుగుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Hair Conditioner : ఈ  ఏడాది ఫిబ్రవరి నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం(Russia-Ukraine War) కొనసాగుతోంది. అయితే ఉక్రెయిన్ పై యుద్ధంలో తమ దేశ సైనిక దళాలు క్రమంగా తోక ముడుస్తున్నట్టు తెలియడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ లో అసహనం పెరుగుతోంది. ఈ క్రమంలో పశ్చిమ దేశాలకు అణ్వస్త్ర(Nuclear)హెచ్చరికను జారీ చేశారు పుతిన్. తమ దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తేవాలనుకుంటే అణ్వాయుధ దాడికి(Nuclear War) సిద్దపడతామని పశ్చిమదేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశాన్ని, తమ ప్రజలను రక్షించుకోవడానికి అందుబాటులో ఉన్న ఆయుధాలనన్నీ వినియోగించుకుంటామని పుతిన్ చెప్పారు. రష్యా సరిహద్దుల దిశగా నాటో దేశాలు చొచ్ఛుకువస్తున్నట్టు అభిప్రాయపడిన పుతిన్.. తమ దేశాన్ని నాశనం చేసేందుకు పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. మాస్కో మీద అణ్వాయుధాల ప్రయోగానికి సంబంధించి అవి న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని, దీనిపై చర్చిస్తున్నాయని పుతిన్ అన్నారు.

రష్యా అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉందని వార్తలు వెలువడిన నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. పుతిన్ వార్నింగ్ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తన దేశ పౌరులకు శుక్రవారం సంచలన సలహా ఇచ్చింది. అణు విస్ఫోటనం సంభవించినప్పుడు పౌరులు చేయవలసినవి, చేయకూడని వాటి గురించి అమెరికా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ CDC(Centers for Disease Control and Prevention)అడ్వైజరీ జారీ చేసింది. అణుయుద్ధం జరిగినప్పుడు ప్రజలు జుట్టుకు కండీషనర్ లను ఉపయోగించవద్దని,ఇది ప్రాణాతంకం అని సూచించింది. సాధారణ రోజుల్లో కండిషనర్లు మీ జుట్టును రక్షిస్తాయి..కానీఅణు విస్ఫోటనం సంభవించినప్పుడు కండిషనర్లు మీ జుట్టుకు రేడియోధార్మిక పదార్ధాల మధ్య జిగురుగా పని చేస్తాయని,దీంతో ఈ రేడియోథార్మిక పదార్థాలు జుట్టుని గట్టిగా అంటిపెట్టుకొని ఉండిపోతాయని,దీంతో ప్రాణాతంకకంగా మారుతుందని తెలిపింది.

అక్కడ ఇప్పుడిదే ట్రెండ్..తల్లి,చెల్లితో భర్తను శృంగారానికి అనుమతించిన భార్య

అణుబాంబు పేలితే, రేడియోధార్మిక ధూళిని మేఘాలు గాలిలోకి నెట్టివేస్తాయని..అలాంటి సమయంలో వీలైనంత త్వరగా స్నానం చేయాలని.. కలుషిత దుస్తులను తీసివేసి షాంపూతో తల స్నానం చేయాలని సూచించింది. దీనివల్ల సురక్షితంగా ఉండే అవకశాం ఉందని తెలిపింది. షాంపూని ఎందుకు ఉపయోగించాలంటే ఇది మీ జుట్టులో ఆయిల్, ధూళిని అంటిపెట్టుకుని ఉండే ఏదైనా మురికి కణాలను దూరంగా ఉంచుతుంది. కానీ కండిషనర్‌లలో సర్ఫ్యాక్టెంట్లు నీటిని,ఆయిల్ ని ఆకర్షిస్తాయని తెలిపింది. అణు విస్ఫోటనం జరిగితే ప్రజలు రేడియేషన్‌ను నివారించడానికి ఇటుక లేదా కాంక్రీట్ భవనం లోపల ఆశ్రయం పొందాలని సూచించింది. ప్రజలు తమ కళ్లు, ముక్కు నోటిని తాకకుండా ఉండాలని కూడా సీడీసీ సూచించింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Hair styling, Nuclear, Russia-Ukraine War, USA

ఉత్తమ కథలు