Home /News /life-style /

Wheat grass: వీట్ గ్రాస్ జ్యూస్ ఎవరు తాగకూడదు తెలుసా?

Wheat grass: వీట్ గ్రాస్ జ్యూస్ ఎవరు తాగకూడదు తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వీట్‌ గ్రాస్‌ ఎల్లప్పుడూ తాజా రసం తీసుకోవాలి. కానీ, ఈ రోజుల్లో ఇది పొడి రూపంలో కూడా దొరుకుతుంది. ఈ వీట్‌గ్రాస్‌ను ప్రోటీన్‌ షేక్స్, స్మూతీలతోపాటు తీసుకోవచ్చు.

వీట్‌గ్రాస్‌ (wheat grass)  ట్రీటికమ్‌ ఫెస్టివల్‌ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అవుతుంది. దీంట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇది రోజు తీసుకుంటే.. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది కొన్ని నిర్ధిష్ట వ్యాధులను కూడా నయం చేస్తుంది. చికిత్స తర్వాత త్వరగా నయం కావడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్నే సంపూర్ణ పోషణ అని కూడా అంటారు. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫెమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది.

వీట్‌ గ్రాస్‌ వల్ల కలిగే ప్రయోజనాలు..
ఆరోగ్యాన్ని మెరుగుపరచే గుణం ఉన్న వీట్‌గ్రాస్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, విటమిన్లు, ఏ, సీ, ఈ, కే, బీ కాంప్లెక్స్, ప్రోటీన్లు, ఎంజైమ్‌లతోపాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు థెరపిటిక్‌ లాభాలు లభిస్తాయి. అందుకే దీన్ని పరిపూన ర్ణ పోషణ అని కూడా అంటారు.

ఇది కూడా చదవండి: 

జీర్ణక్రియ మెరుగుదల..
వీట్‌గ్రాస్‌ ఎంజైమ్‌లతో  ఉంటుంది. ఇది పోషకాలను గ్రహించడానికి సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళంగా విడగొట్టడానికి సహాయపడుతుంది. ఈజీగా డైజెస్ట్‌ digest అవ్వడానికి తోడ్పడుతుంది. ఇది పేగులను శుభ్రపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే కడుపు ఉబ్బరం, గ్యాస్‌ ఇతర ఉదర సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకుంటారు.

టాక్సిన్స్‌ను తగ్గిస్తుంది..
వీట్‌గ్రాస్‌లో క్లోరోఫిల్‌ chlorophyll ఉంటుంది. ఇది హానికరమైన అంశాలను నిర్విర్యం చేస్తుంది. అందుకే కాలేయాన్ని కూడా ఆరోగ్యవంతం చేయడంలో సహకరిస్తుంది. వీట్‌గ్రాస్‌లో చాలా సహజ అంశాలు ఉంటాయి. ఇవి విషాన్ని, ఇతర మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి:  మైగ్రేన్ సమస్య ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినకూడదు..


రోగనిరోధక శక్తిని పెంచుతుంది..
శరీరంలో రోగనిరోధక శక్తి immunity boost ని పెంచడానికి వీట్‌గ్రాస్‌ దోహదం చేస్తుంది. ఇది శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిరోధిస్తుంది. వ్యాధులను దూరం చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్‌ చేయడం వల్ల అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది.

మెటబాలిజం బూస్ట్‌ అవుతుంది...
బరువు తగ్గడం, జీవక్రియను మెరుగుపరచడంలో వీట్‌ గ్రాస్‌ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్‌ తక్కువ కేలరీలలతోపాటు కొవ్వు రహితం కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి:  మహిళల ఆరోగ్యవంతమైన గుండెకు ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి..


వీట్‌గ్రాస్‌తో సైడ్‌ఎఫెక్ట్స్‌..

  • ఈ వీట్‌గ్రాస్‌ను నాణ్యమైనది తీసుకోవాలి. అందుకే బ్రాండెడ్‌ దుకాణాల నుంచి కొనుగోలు చేయాలి. అంతేకాదు, శుభ్రమైన కంటైనర్లలో మాత్రమే నిల్వ చేసుకోవాలి.

  • దీన్ని చిన్న మోతాదుతో ప్రారంభించాలి. క్రమంగా మోతాదును పెంచుకోవాలి.

  • వికారం, తలనొప్పి, మలబద్ధకం, కడుపునొప్పి, జ్వరం ఉన్నవారితోపాటు పాలిచ్చే తల్లులు దీన్ని తీసుకోవద్దు.

  • కొంతమందికి అలర్జీ ఉంటుంది. వారు తీసుకోవద్దు.

Published by:Renuka Godugu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు