DO NOT STORE WATER IN COOL DRINK OR MINERAL WATER BOTTLES KNOW WHY RNK
జాగ్రత్త! కూల్ డ్రింక్ లేదా మినరల్ వాటర్ బాటిల్లో నీటిని నిల్వ చేస్తున్నారా? ఈ ప్రమాదం తప్పదు..
ప్రతీకాత్మక చిత్రం
శీతల పానీయం లేదా మినరల్ వాటర్ బాటిళ్లను ఫ్రిజ్‌లో నీటిని నిల్వ చేయడానికి చాలా కాలంగా ఉపయోగిస్తున్నారా?. ఇది సౌకర్యవంతంగా అనిపించవచ్చు,కానీ, ఎంత ప్రమాదమో తెలుసా?
వేసవికాలం (Summer) ప్రారంభమైంది.. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేందుకు కూలర్లను వాడతారు. అలాగే శీతల పానీయాల సహాయంతో శరీరాన్ని శాంతింపజేసే ప్రయత్నాలు చేస్తారు. వేసవిలో శరీరానికి చల్లటి నీరు (Cool water) చాలా అవసరం. శీతల పానీయాలు తాగిన తరువాత, వారి ఖాళీ సీసాలు పాడేయ్యరు. వాటిని శుభ్రంగా కడిగి మళ్లీ ఫ్రిజ్‌లో తాగునీరు ఉంచేందుకు ఉపయోగిస్తారు. శీతల పానీయం లేదా మినరల్ వాటర్ బాటిళ్లను ఫ్రిజ్‌లో నీటిని నిల్వ చేయడానికి చాలా కాలంగా ఉపయోగిస్తున్నారా?. ఇది సౌకర్యవంతంగా అనిపించవచ్చు, కానీ, మీకు ప్రమాదకరం. అవును, మీరు చదివింది నిజమే. శీతల పానీయాల బాటిళ్లలో నీటిని నిల్వ చేయడం ,వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం కూడా మీకు హానికరం. దాని గురించి వివరంగా తెలుసుకోండి.
ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ ఉంచిన నీరు మీ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. ఇది చాలా నివేదికలలో ప్రస్తావనకు వచ్చింది. ప్లాస్టిక్ బాటిళ్లలోని రసాయనాలు మీ శరీరంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయి. ప్లాస్టిక్‌లో ఉండే థాలేట్స్ అనే రసాయనాలు కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఈ ప్లాస్టిక్ బాటిళ్లలో ఎక్కువసేపు నీటిని నిల్వ ఉంచడం వల్ల ఫ్లోరైడ్, ఆర్సెనిక్ ఉత్పత్తి అవుతాయి. ఈ మూలకాలు శరీరానికి చాలా ప్రమాదకరమైనవి. ఈ మూలకాలు శరీరంలో స్లో పాయిజన్‌గా పనిచేస్తాయని భావిస్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్ లో నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీని వల్ల పొట్ట సమస్యలు వస్తాయి.
ఈ ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ ఉంచిన నీరు సూర్యరశ్మికి తగిలినప్పుడు లేదా పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా వేడెక్కినప్పుడు, అందులో విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ప్లాస్టిక్ బాటిల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన నీరు బీపీఏ (బిఫినైల్ ఏ) అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రసాయనాలు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి మరియు ఆహారాన్ని జీర్ణం చేయడాన్ని కష్టతరం చేస్తాయి. అదనంగా, ఈ రసాయనాలు ఊబకాయం, మధుమేహం వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్లాస్టిక్ బాటిల్‌ని ఉపయోగించడం వల్ల మీ శరీరానికి హాని మాత్రమే కాదు. ప్లాస్టిక్లు కుళ్లిపోకుండా వాటి పరిమాణం పెరుగుతూ కాలుష్య సమస్య కూడా పెరుగుతోంది. కాబట్టి మనం ఇంట్లోనే కాకుండా ఇతర ప్రదేశాలలో కూడా ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా ఉండాలి.
(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.