Eggs: కోడి గుడ్లను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టొద్దు.. ఎందుకంటే..

ఫ్రతీకాత్మక చిత్రం

Eggs: సాధారణంగా మనలో చాలామంది కోడి గుడ్లను ఫ్రిజ్‌లో పెడతుంటాము. అయితే ఇలా ఫ్రిజ్‌లో దాచిన గుడ్లు తింటే ఆరోగ్యం సంగతేమోకానీ అనారోగ్యం తప్పదని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

  • Share this:
కోడి గుడ్లు ఫ్రిజ్ లో పెట్టరాదు. అదేంటి కోడి గుడ్లు పెట్టేందుకు ఫ్రిజ్ లో స్పెషల్ రాక్ కూడా ఉంది కదా ఎందుకు పెట్టరాదు, మెమెప్పుడు అలాగే పెడతాం.. ఇలా పెడితే ఎక్కువ రోజులు చెడిపోకుండా గుడ్లు ఫ్రెష్ గా ఉంటాయని వాదించకండి. గుడ్లను ఇలా ఫ్రిజ్ లో ఉంచితే వాటిలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా (bacteria) పెరుగుతుంది. ఇవి తిన్నప్పుడు మీకు సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.

ఆరోగ్యానికి చాలా మంచిది
గుడ్లలోని పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాల్షియం, ప్రొటీన్ (protein) వంటివి పుష్కలంగా ఉన్న గుడ్లను మనం సాధారణంగా ఫ్రిజ్‌లో పెడతాం. ఇలా ఫ్రిజ్‌లో దాచిన గుడ్లు తింటే ఆరోగ్యం సంగతేమోకానీ అనారోగ్యం తప్పదని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. చల్లటి వాతావరణంలో ఉన్న గుడ్లను రూమ్ టెంపరేచర్ (room temperature) వద్దకు తేగానే వాటిలో బ్యాక్టీరియా పెరిగే ఆస్కారం చాలా ఎక్కువ. టెంపరేచర్లు మారటంతో జరిగే కండెన్సేషన్ (condensation) కారణంగానే గుడ్లపై ఉన్న పొట్టుపై (shell) బ్యాక్టీరియా శరవేగంగా పెరుగుతుంది. ఇలాంటివి తింటే అనారోగ్యం తప్పదు. అందుకే రూం టెంపరేచర్ వద్ద మాత్రమే గుడ్లను నిలువ చేయాలి. ఎక్కువ చల్లగా లేదా ఎక్కువ వేడిగా ఉన్న వాతావరణంలో గుడ్లను నిల్వ ఉంచరాదు.

1-3 వారాల్లో తినేయాలి
గది ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచిన కోడి గుడ్లను 1-3 వారాల్లోగా ఉపయోగించాల్సిందే. కానీ ఫ్రిజ్ లో పెట్టిన గుడ్లను మరింత ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచి, వండుకోవచ్చు. కానీ ఇలా ఫ్రిజ్ లో పెట్టిన గుడ్లకు ఫ్రిజ్ లో ఉన్న మిగతా పదార్థాల వాసనలు అంటుతాయి. సాధారణంగా ఫ్రిజ్ డోర్ లోనే వీటిని నిలువ చేస్తాం. అయితే ఫ్రిజ్ డోర్ పదేపదే వేయడం తీయడంతో డోర్ లో ఉన్న గుడ్ల ఉష్ణోగ్రతల్లో మార్పులపై ప్రభావం ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా పెరుగుతుందన్నమాట. అందుకే ఒకవేళ మీరు ఫ్రిజ్ లో వీటిని ఉంచాల్సి వస్తే ముందు బలమైన కార్టన్ బాక్స్ లేదా గాలి దూరని డబ్బాలో వీటిని పెట్టి, ఫ్రిజ్ వెనకల భాగంలో పెట్టండి. డోర్ లో మాత్రం పెట్టకండి. ఇలా చేస్తే బ్యాక్టీరియా గుడ్లపై చేరే ప్రమాదం ఉండదు.

బేకింగ్‌కు పనికి రావు
ఇటీవలి కాలంలో కొందరు షెఫ్‌లు చెబుతున్న దాని ప్రకారం ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్ల కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న గుడ్లతో బేకింగ్ చేస్తే వాటి రుచి, texture బాగుంటాయి. లేదంటే ఫ్రిజ్ నుంచి గుడ్లను తీశాక కనీసం 2 గంటల పాటు వాటిని బయటే ఉంచి, ఆతరువాత ఉపయోగించాలి. అమెరికా వంటి దేశాల్లో ఉన్న ఉష్ణోగ్రతల్లో ఫుడ్ పాయిజనింగ్ కాకూడడంటే వీటిని ఫ్రిజ్ లో ఉంచాలి. పలు యూరోప్ దేశాల్లో అయితే బయటనే వీటిని నిల్వ ఉంచేస్తారు. కాబట్టి మీరున్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, ఏ సీజన్ అన్నది చూసుకుని అవసరమైతే ఫ్రిజ్ లో పెట్టి, తగు జాగ్రత్తలు తీసుకోండి.

వీటిని ఫ్రిజ్ లో పెట్టకండి
కొన్ని పదార్ధాలు, పళ్లు, కూరగాయలు ఫ్రిజ్ లో పెట్టరాదు. ఉదాహరణకు ఆలూని ఫ్రిజ్ లో ఉంచాల్సిన అవసరం లేదు. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి, వంకాయలు, అరటి పళ్లు, అరటి కాయలు వంటివి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకండి. టమోటాలు కూడా ఫ్రిజ్ లో ఉంచవద్దని న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తారు. టమోటాల్లోని గింజలు ఫ్రిజ్ లో ఉంచినప్పుడు మొలకెత్తుతాయి, ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సలహా ఇస్తారు. కానీ ఇవన్నీ గుర్తుంచుకోకుండా బండగా మీకు నచ్చినవి, ఎక్కువ రోజులు కాపాడుకోవాలనుకున్న వాటిని ఫ్రిజ్ లో అట్టే పెట్టేస్తారు.
Published by:Kishore Akkaladevi
First published: