Items in bathroom: మీ బాత్‌రూంలో ఈ వస్తువులు పెట్టారా? వెంటనే..

ప్రతీకాత్మక చిత్రం

Do not keep these items in bathroom: బాత్‌రూంలో కేవలం టవల్స్‌ మాత్రమే పెట్టుకోవాలి. కానీ, చాలా మంది తడిగా ఉన్న టవల్స్‌ను పెడతారు. అది మీకు హానికరం కావచ్చు.

  • Share this:
కొన్నిసార్లు ఫ్యాషన్‌  (Fashion) కారణంగా.. మరికొన్నిసార్లు ఇతరులను అనుకరించడం వల్ల తెలియని తప్పులు చేస్తాం. ఉదాహరణకు కొన్ని వస్తువులు బాత్‌రూం (bathroom) లో ఉంచుతారు.అవి అక్కడ పెట్టాలో లేదో తెలియదు. కానీ, మేకప్, మందులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉంటాయి. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని వస్తువులు బాత్‌రూంలో పెట్టకూడదు. ఎందుకంటే, వాటిని అక్కడ పెట్టడం వల్ల అవి పాడైపోతాయి. కొన్ని అంశాలు ఉన్నాయి. వాటితో మీకు ఆరోగ్యపరంగా మంచివి కావు.

చాలా మంది బాత్రూంలో పాటలు (music) వినే అలవాటు ఉంటుంది.ఈ కారణంగా ఐపాడ్‌ లేదా రేడియో వంటి వాటిని బాత్‌రూంలో పెట్టుకుంటారు. ఏ ఎలక్ట్రానిక్‌ వస్తువులు అయినా బాత్‌రూంలో ఉంచకూడదు. తేమ కారణంగా అవి చెడిపోయే ప్రమాదం ఉంటుంది.

ఇది కూడా చదవండి: కృత్రిమ ఐల్యాషస్‌ వాడితే.. కళ్లకు ఇంత డేంజరా..?

పుస్తకాలు, మ్యాగజైన్స్‌..
చాలా మందికి బాత్‌రూంలో బుక్స్‌ లేదా మ్యాగజైన్‌ చదవడం వలవాటు ఉంటుంది. దీనివల్ల వాటిని బాత్‌రూంలో పెడతారు. అలా చేయడం వల్ల అవి మరింత పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, దీనివల్ల అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. తేమ కారణంగా కాగితం ఉత్పత్తులు తేమను గ్రహిస్తాయి. దీంతోపాటు వాటిలో బ్యాక్టిరియా కూడా పెరగడం ప్రారంభమవుతుంది.

మేకప్‌ సామగ్రీ...
బాత్‌రూంలో చాలా మంది మేకప్‌ ఉత్పత్తుల కోసం క్యాబిన్‌ కూడా ఏర్పాటు చేసుకుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పద్ధతి కూడా సరైంది కాదు. దీని కారణంగా మేకప్‌ ఉత్పత్తుల్లో తేమ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో మీ ఖరీదైన మేకప్‌ వస్తువులు పాడైపోతాయి.

ఇది కూడా చదవండి:  పండగవేళ.. ఇంటిని తక్కువ టైంలోనే క్లీన్‌ చేసుకోవచ్చు!

బాత్‌రూంలో కేవలం టవల్స్‌ మాత్రమే పెట్టుకోవాలి. కానీ, చాలా మంది తడిగా ఉన్న టవల్స్‌ను పెడతారు. అది మీకు హానికరం కావచ్చు. బాత్‌రూం తడిగా ఉంటుంది. అందులో టవల్‌ కూడా తడిగా ఉంటుంది. దీంతో టవల్‌ మీద బ్యాక్టిరియా పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఔషధాలు...
చాలా మంది మెడిసిన్స్‌ను బాత్‌రూం క్యాబినెట్‌లో పెట్టుకుంటారు. అయితే, బాత్‌రూంలో ఉండే తేమ కారణంగా మందులు పాడైపోతాయి. కాబట్టి వీటిని అక్కడ పెట్టకూడదు. ఔషధాలు ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి.
Published by:Renuka Godugu
First published: