Health care: జాగ్రత్త! ఇవి ఫ్రిజ్‌లో పెడితే.. విషం కంటే ప్రమాదం..

కొన్ని రకాల స్నాక్స్, కూరగాయలు ఫ్రిజ్‌లో పెడితే.. అవి త్వరగా పాడైపోతాయి. మరికొన్ని రకాల ఆహారం ద్వారా ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.

కొన్ని రకాల స్నాక్స్, కూరగాయలు ఫ్రిజ్‌లో పెడితే.. అవి త్వరగా పాడైపోతాయి. మరికొన్ని రకాల ఆహారం ద్వారా ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.

  • Share this:
మనం తినే లంచ్, డిన్నర్‌తోపాటు పాలు, ఇతర పండ్లు కూరగాయలు ఎక్కువగా తెచ్చుకుంటే ఏం చేస్తాం? ఫ్రిజ్‌ Refrigerator లో పెట్టుకుంటాం. ఇలా ఎలా పడితే అలా.. అన్ని ప్రిజ్‌లో తోసేస్తారు. అయితే, కొన్ని రకాల ఫుడ్స్‌ ప్రీజ్‌లో పెడితే విషం కంటే ప్రమాదంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

  1. బ్రెడ్‌ తిన్నాక.. మిగిలిన స్లైసెస్‌ ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. దీంతో అవి గట్టిబడతాయి. అలా కాకుండా కవర్‌లోనే ప్యాక్‌ చేసి ఉంటే మెత్తగా బాగుంటాయి.

  2. మామూలుగా వేసవిలో కూడా ఫ్రిజ్‌లో పెట్టిన నీరు తాగితే కాస్త ఉపశమనంగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో ఫ్రీజ్‌ అవసరం చాలా మందికి ఉంటుంది. కానీ, ఇవి తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి.

  3. పుచ్చకాయ watermelon వేసవిలో చాలా వరకు చల్లగా ఉండేందుకు ఈ కాయను ఫ్రిజ్‌లో పెట్టి తింటారు. కొన్నపుడు రెండు మూడు కాయలు కొంటారు కాబట్టి ఫ్రిజ్‌లో పెట్టుకుంటారు. కానీ, ఎప్పుడూ పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెడితే ముక్కలుగా కోసి, ఓ బాక్స్‌లో పెట్టాలి.


నిల్వ చేసిన పిండిలో పురుగులు చేరుతున్నాయా? ఈ విధంగా తరిమేయండి!



  1. బంగాళ దుంపలు Potato కూడా ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అందులోని చక్కెర శాతం అధికమవుతుంది. దీనివల్ల కూరల్లో రుచిమారుతుంది. అందుకే వీటిని బయటే, వంటగదిలో పెట్టుకోవడం బెటర్‌.

  2. ఫ్రిజ్‌లో పూలను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. వీటి వాసన ఫ్రిజ్‌లోని ఇతర ఆహార పదార్థాలపై ప్రభావం చూపుతుంది. అటువంటి ఫుడ్‌ను మనం తినలేం. కాబట్టి, పూలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

  3. పచ్చళ్లు కూడా కాలానికి తగ్గట్టుగా పెట్టుకుంటారు. అయితే, వీటిని ఫ్రిజ్‌లో స్టోర్‌ చేయకూడదు. వీటికి కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఫ్రిజ్‌లో పెడితే ఊరగాయ త్వరగా పాడైపోతుంది.

  4. ఉల్లిపాయలు onions కూడా ప్రతిరోజు వంట కంటే ఎక్కువే తెచ్చుకుంటారు. అయితే, వీటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటి వాసన ఇతర పదార్థాలకు కూడా వ్యాపిస్తుంది. అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

  5. అరటి పండ్లు కూడా ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అందులో ఉండే ఎంజైమ్‌లు తగ్గిపోతాయి. పైగా అవి త్వరగా పాడైపోతాయి కూడా.

Published by:Renuka Godugu
First published: