• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • DO NOT FORGET THESE PRECAUTIONS WHILE HAVING SEX AND ROMANCE ON VALENTINE DAY AK GH

Valentine's day: ప్రేమికుల రోజు శృంగారం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు..

Valentine's day: ప్రేమికుల రోజు శృంగారం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు..

ప్రతీకాత్మకచిత్రం

Valentine’s Day: అంటువ్యాధులు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మీ సురక్షిత కలయిక కోసం ఎస్టీడీ టెస్ట్ను చేయించుకోండి. మీ ఇద్దరికీ ఎటువంటి అంటు వ్యాధులు లేవని నిర్థారణ అయిన తర్వాతే శృంగారానికి సిద్ధమవ్వండి.

  • Share this:
మరో నాలుగు రోజుల్లో ప్రేమికులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేమికుల రోజు రాబోతుంది. ఆ రోజు ప్రేమికులంతా ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ వేసుకుని ఉంటారు. ఫుల్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. మన దేశంలో ఇదివరకు దీన్ని చాలా తక్కువగా జరుపుకునేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ వేడుక బాగా ప్రసిద్ది చెందింది. కొందరు దీనిని పాశ్చాత్య వేడుకగా భావిస్తే.. మరికొందరు మాత్రం ఇది ప్రేమకు చిహ్నంగా, ఇతరులపై తమ అభిమానాన్ని వ్యక్తం చేసే రోజుగా భావిస్తున్నారు. ఏదేమైనా, అనేక ఇతర దేశాల మాదిరిగానే, భారతదేశంలోని ప్రజలు కూడా ప్రేమికుల రోజును జరుపుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏటా ఫిబ్రవరి 14న జరుపుకునే ఈ వేడుకలో జంటలు తమ ప్రేమను మానసికంగా, శారీరకంగా వ్యక్తీకరించడానికి అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. పగటిపూట పువ్వులు, చాక్లెట్లతో, రాత్రి పూట ఉల్లాసభరితమైన శృంగార అనుభూతుల్ని పొందేందుకు ప్లాన్ చేస్తుంటారు. అందువల్ల, మీరు కూడా ప్రేమికుల రోజున మీ భాగస్వామితో సురక్షితమైన, ఆహ్లాదకరమైన శృంగారాన్ని కోరుకుంటున్నారా?.. అయితే, మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకోండి.

కండోమ్స్ వాడటం తప్పనిసరి
ప్రేమికుల రోజును మధురమైన జ్ఞాపకంగా మార్చుకోవడానికి సురక్షితమైన శృంగారాన్ని అవలంభించండి. దీని కోసం ఎల్లప్పుడూ మీ బెడ్‌రూమ్‌లో కండోమ్‌ల ప్యాకెట్ ఉందని నిర్ధారించుకోండి. మిమ్మల్ని, మీ భాగస్వామిని STI, STDలతో పాటు ఇతర అంటువ్యాధుల నుండి రక్షించడానికి కండోమ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

గడువు ముగియని కండోమ్‌లనే వాడండి
సురక్షిత శృంగారం కోసం గడువు ముగియని కండోమ్‌ ప్యాకెట్లనే కొనుగోలు చేశారని నిర్ధారించుకోండి. ఫార్మసీ లేదా మెడికల్ షాపులో దాన్ని కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా దాని గడువు తేదీని తనిఖీ చేయండి. అయితే, మీరు మంచి మూడ్లోకి వచ్చినప్పుడు కండోమ్ను మర్చిపోయే ప్రమాదం ఉంది. దీని కోసం ఎల్లప్పుడూ మీ ప్రక్కనే కండోమ్ ప్యాకెట్ ఉండేలా చూసుకోండి.

ఎస్టీడీ టెస్ట్ చేయించుకోండి
అంటువ్యాధులు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మీ సురక్షిత కలయిక కోసం ఎస్టీడీ టెస్ట్ను చేయించుకోండి. మీ ఇద్దరికీ ఎటువంటి అంటు వ్యాధులు లేవని నిర్థారణ అయిన తర్వాతే శృంగారానికి సిద్ధమవ్వండి. ముఖ్యంగా, ఎక్కవ మందితో మీరు శృంగారంలో పాల్గొనాలనుకుంటే ఇది ఎంతో కీలకం అని గుర్తించుకోండి.

అదనపు జాగ్రత్తలు తీసుకోండి
శృంగారంలో అనేక అపోహలు ఉండటం సహజమే. అయితే, వాటిపై అవగాహన పెంచుకొని ముందుకు వెళ్తే ఎటుంటి సమస్య ఉండదు. ముఖ్యంగా శృంగారం సమయంలో అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, శృంగారం చేసిన తర్వాత మూత్ర విసర్జన చేసి, అంటువ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. దీని వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ మీ దరి చేరదని గుర్తించుకోండి.

ప్రత్యేకమైన రోజుగా జరుపుకోండి
వాలెంటైన్ డే రోజును మధురమైన జ్ఞాపకంగా మలచుకోండి. సాధారణ రోజుల్లో చేసే శృంగారం కంటే ప్రత్యేకమైన శృంగార అనుభూతుల్ని పొందండి. మీ ప్రేమను వ్యక్తపర్చడానికి శృంగారం కూడా ఒక మంచి సాధనమని గుర్తించండి. ఈ సహజమైన చిట్కాలతో మీ అద్భుతమైన ప్రేమికుల రోజును జరుపుకోండి.
Published by:Kishore Akkaladevi
First published: