చపాతీ, అన్నం మధ్యాహ్నం భోజనంలో (meal) తప్పకుండా ఉండాల్సిందే. మరికొందరు పెరుగు, కూరగాయలు వగైరా భోజనంలో చేర్చుకుంటారు. అయితే, చపాతీ, అన్నం కాంబినేషన్లో తింటే ఎంత ప్రమాదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పుట్టుకతో ఎవరికీ అనారోగ్యం ఉండదు. కానీ, క్రమంగా వారి లైఫ్ స్టైల్ (life style) కారణంగా వారు అనారోగ్యానికి గురవుతారు. ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తింటాం. మనం పౌష్టికాహారం తీసుకుంటామా? మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మనం పట్టించుకోం. శరీరానికి తగ్గినంత శక్తి లభించదు. ఆరోగ్యకరమైన పోషకాలు మాత్రమే శరీరం పెరుగుదలకు సహాయపడతాయి.
రొట్టెతో అన్నం తింటున్నారా?
కొంతమందికి భోజనంతోపాటు చపాతీ తప్పకుండా తింటారు. మరికొంత మంది పెరుగు, కూరగాయలు వగైరా భోజనంలో చేర్చుకుంటారు. అందుకే వీటి కాంబినేషన్లో తింటారు.
ఇది కూడా చదవండి: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే.. ఈ ఒక్క పని చేస్తే చాలు..
బరువు..
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లియతే మీరు సరైన మోతాదులో ఆహారం తీసుకోకపోతే.. ఇది తింటే వ్యర్థమవుతుంది. ఇది ఒబేసిటీకి దారితీస్తుంది. కొవ్వు చేరితే దాన్ని తగ్గించుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే బరువు తగ్గడం నోటితో చెప్పినంత ఈజీ కాదు.
అజీర్ణ సమస్యలు..
కొందరు భోజనం తినేటప్పుడు ఎక్కువ మొత్తంలో తింటారు. ఇది అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. రెండు సరిగ్గా జీర్ణం కాకపోవడంతో కడుపులో గ్యాస్ నిండిపోతుంది.
ఇది కూడా చదవండి: మెడిటేషన్ 5 నిమిషాలే కదా.. అనుకోకండి.. ఆశ్చర్యకర ఫలితాలు..
కేలరీలు..
చపాతీ, అన్నం కలిపి తింటే పొట్ట బరువు పెరుగుతుంది. అంతేకాదు నిపుణుల అభిప్రాయం ప్రకారం మధ్యాహ్నం లేదా రాత్రి మాత్రమే అన్నం తినాలి. చపాతీ తినాలంటే కేవలం చపాతీ మాత్రమే తినండి.
దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. అంటే చల్లని అన్నం తింటే శ్వాసకోశ లేదా ఆస్తమాతో బాధపడేవారికి మరింత సమస్య అవుతుంది.అందుకే వారు అన్నం మానేయాలి.
డయాబెటిస్..
అన్నం ఎక్కువ తింటే శరీరంలో డయాబెటిస్, ఒబేసిటీ వస్తుంది. ఇది గుండె మూత్రపిండాల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
జీర్ణక్రియ..
మీరు రాత్రిపూట అన్నం, చపాతీ రెండు కలిపి తింటే కడుపు సమస్యలు మొదలవుతాయి. రాత్రిపూట జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి చిరుతిండి తినడమే మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.