Diet Mistakes: ఆహార నియమాలు.. ఇలా చేస్తే కోరి రోగాలు తెచ్చుకున్నట్టే..

ప్రతీకాత్మక చిత్రం

Diet Mistakes: ఆరోగ్యకరమైన పోషకాహారం గురించి మనకు తెలిసినప్పటికీ మిగతా విషయాలపై అవగాహన లేక చేసే పొరపాట్లతో రోగాలు చుట్టుముడతాయి.

  • Share this:
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని మీరు ఎంత గట్టిగా అనుకున్నా.. మీకు తెలియకుండానే మీరు బోలెడన్ని అనారోగ్యకరమైన తిళ్లను లాగిస్తుంటారు. జంక్ ఫుడ్ (junk food) తినరాదనుకోవటం మంచిదే కానీ వీటితోపాటు ఇలాంటి అనారోగ్యకరమైన తిళ్లు మీ మెనూలో ఏమున్నాయో, ఏ రూపంలో ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. చిన్న చిన్న పొరపాట్లు క్యాన్సర్ వంటి పెద్ద రోగాలకు కారణమవుతాయి. మనం భోజనం వండేటప్పుడు, తినేప్పుడు చేసే ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు. అంతేకాదు సమయానికి బోజనం చేయటం విధిగా పాటించండి. ఇక ప్రాసెస్డ్ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్ జోలికి పోకుండా, మన ప్రాంతంలో పండే కూరగాయలు, పళ్లు, ధాన్యానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఇంపోర్టెడ్ పళ్లు, వెజిటబుల్స్, ధాన్యం మంచిదే అయినప్పటికీ మన శరీరతత్వానికి పూర్తిగా సరిపోకపోవచ్చు. ఇంత చక్కని పోషకాహారాన్ని తీసుకుంటున్నా మీ కుటుంబం తరచూ అనారోగ్యంపాలవుతోందంటే.. ఈ కింది మిస్టేక్స్ మీరు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి.. ఎందుకంటే ఆరోగ్యకరమైన పోషకాహారం గురించి మనకు తెలిసినప్పటికీ మిగతా విషయాలపై అవగాహన లేక చేసే పొరపాట్లతో రోగాలు చుట్టుముడతాయి.

భోజనం తినకపోవటం
అలసట, బద్ధకం, లో బీపీ, తలనొప్పి, ఏమాత్రం శక్తి లేకపోవటం వంటి అనారోగ్యాలు మిమ్మల్ని చుట్టుముట్టేలా చేసేవి ఏమిటంటే మీరు భోజనం mealsవద్దనుకోవటం. మీల్స్ మిస్ అయితే శరీరానికి పోషకాల కొరత వస్తుంది, అంతే ఇంక పలువిధాలుగా అది మిమ్మల్ని బాధిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందించే ఆహారం తినకపోవటం అనేది అతిపెద్ద తప్పు నిర్ణయం. కాబట్టి ఎప్పుడూ మీరు మీల్స్ ను మిస్ చేయకండి. దీనికి బదులు మితంగా తినండి. బరువు తగ్గాలంటే భోజనం తినకుండా ఉంటే సరి అనుకోవటం తప్పు. రోజుకు మూడు సార్లు తినటం తప్పనిసరి ఇలా చేస్తేనే మీరు బరువు కూడా తగ్గుతారు. ఎక్సర్ సైజు చేయకుండా భోజనం ఎగరగొడితే సన్నబడరు. అంతేకాదు భోజనం మిస్ చేస్తే మీలో ఉన్న సహజసిద్ధమైన ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది.

పళ్లు, కూరగాయలు కడగకుండా పొట్టు తీయటం
అన్ని రకాల పళ్లు, కూరగాయల పొట్టుపై సూక్ష్మక్రిములు ఉంటాయి. అంతేకాదు చీడపీడల నివారణ కోసం పంటపొలాల్లో చల్లే రసాయనాలు కూడా వీటిపై పేర్కొని ఉంటాయి. కాబట్టి పళ్లు, కూరగాయలను కడగకుండా తినటం ప్రమాదకరం. ఇలా చేయటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు నర్వ్ సిస్టంపై ఈ రసాయనాలు తీవ్ర ప్రభావం చూపుతాయి, ఇంకా మన ఇమ్యూనిటీపై ఇవి దాడి చేస్తాయి, సంతానోత్పత్తిపై ఈ రసాయనాల ప్రభావం ఎక్కువ. అందుకే పళ్లు లేదా కూరగాయలు పొట్టు తీసేముందు, ముక్కలుగా కోసుకునే ముందే బాగా కడిగి శుభ్రం చేయటం అవసరం.

వాసన, రుచి చూడటం
కంటికి కనిపించని సూక్ష్మక్రిములు మీపై దాడిచేసేది ఇలాంటప్పుడే. ఫ్రెష్ గా ఉందో లేదో వాసన చూద్దాం, కాస్త రుచి చూస్తే ఇది తాజాగా ఉందా చెడిపోయిందో తెలుస్తుంది అని మీరు చేసే చిన్న పొరపాటుతో అనారోగ్యాలు దాపురిస్తాయి. మీరు ఫ్రిజ్ లో నిల్వచేసినా, బయట ఉంచిన పదార్థాలు తాజాగా ఎన్నిరోజులుంటాయనే చార్ట్ ఫాలో అయితే సరి, ఇలా ప్రయోగాలు చేసి రోగాలపాలవ్వద్దు.

పడుకునే ముందు పళ్లు
పడుకునే ముందు పళ్లు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ దీంతో అజీర్తి, పంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవచ్చు. యాసిడ్ ఎక్కువగా ఉన్న బత్తాయి, మామిడి, డ్రాగన్ ఫ్రూట, టమోటా వంటివి పడుకునేముందు తింటేమాత్రం మీ పంటిపై ఉన్న ఎనామిల్ దెబ్బతినచ్చు. ఎందుకంటే మీరు రాత్రంతా నిద్రపోతారు కనుక నోట్లోని యాసిడ్ ఇలా దంతాల అనారోగ్యానికి కారణం అవుతుంది. ఫ్రక్టోజ్, హై షుగర్ ఉన్న పళ్లను రాత్రి తినటం మానుకుంటే మంచిది. గ్లూకోజ్ అరిగినంత తేలికగా పళ్లలోని షుగర్ జీర్ణం కాదు. ఈ ఫ్రక్టోజ్ జీర్ణం కాక కడుపునొప్పి రావచ్చు. పసుపు రంగులో ఉన్న పళ్లలో ఎక్కువ ఫ్రక్టోజ్ ఉంటుంది. పియర్స్, యాపిల్, చెర్రీలు కూడా రాత్రి తిని పడుకోవటం మంచిది కాదు. ఇవి జీర్ణం కావాలంటే కూడా కాస్త ఎక్కువ శ్రమ అవసరం కనుక ఇలాంటివి తిని పడుకుంటే జీర్ణం కాకపోగా మీకు అనారోగ్యం రావచ్చు. పదేపదే మెలకువ రావటం, రాత్రంతా నిద్రపట్టకపోవటం వంటి చికాకులకు కారణం అవుతాయి.

బ్రేక్ ఫాస్ట్ మిస్టేక్స్
ఉదయం తినే అల్పాహారంలో తమ సొంత ప్రాంతం, సంప్రదాయ అలవాట్లకు బదులు పూర్తిగా మార్చేసిన మెనూ తినటం చాలా ప్రమాదకరం. బ్రేక్ ఫాస్ట్ లో మోడర్న్ మెనూ పెట్టుకుంటే మన భారతీయులు దెబ్బైపోతారు. ఎందుకంటే షుగర్, రీఫైన్డ్ షుగర్ అత్యధికంగా ఉన్న వెస్ట్రన్ మెనూ మన ఒంటికి అస్సలు సెట్ కాదు. అంతేకాదు ప్రాసెస్డ్ ఫుడ్ కూడా కావటంతో ఈ డైట్ dietతో మీరు పోషకాల లేమి ఎదుర్కొంటూనే అనారోగ్యంపాలవుతారు. పిల్ల్లల్లో అయితే ఏకంగా ఊబకాయం వంటి సమస్యలు పుట్టుకొచ్చేలా చేస్తాయి. అందుకే మీ ప్రాంతంలో, మీ ఇంట్లో మొదటినుంచి ఎటువంటి బ్రేక్ ఫాస్ట్ తింటున్నారో దానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి. ఉదాహరణకు మీరు ఇంట్లో ఇడ్లీ చేసుకునేవారైతే దానికి బదులు కార్న్ ఫ్లేక్స్ , బ్రెడ్ అండ్ బటర్ లాంటివి బ్రేక్ ఫాస్ట్ మెనూలో పెడితే మాత్రం అనారోగ్యాలు తప్పవన్నమాట.

చక్కెర
మనం రోజూ తినే ఆహారంలో చక్కెర స్థాయిలు ఉంటాయి. అది మాత్రమే కాకుండా టీ, కాఫీలు, స్వీట్లు, కేకులు, డెజర్ట్స్, జ్యూస్ వంటివాటిలో షుగర్ నిల్వలు అత్యంత ప్రమాదకరం. మితిమీరిన చక్కెర నిల్వలు కరిగించటం కష్టం. వీటితో డయాబెట్స్, ఊబకాయం (obesity), డిప్రెషన్ వంటివి వస్తాయి. త్వరగా వయసు మీదపడటం వంటివి చేసే చక్కెర బదులు తేనె, బెల్లం, తాటిబెల్లం వంటి ప్రత్యామ్నాయాలను వాడండి. వీటిని కూడా మితంగానే వాడాలి.
Published by:Kishore Akkaladevi
First published: