మీకెన్ని గుండెలు.. అంటే ఆశ్చర్యపోకండి..

హార్ట్ ట్రాన్స్‌ప్లానేషన్ చేయకుండా మరో గుండె అమరికకు ప్రయత్నాలు.. రెండో గుండె రక్తనాళాలను మొదటి గుండె రక్తనాళాలతో జత..

news18-telugu
Updated: August 9, 2018, 5:13 PM IST
మీకెన్ని గుండెలు.. అంటే ఆశ్చర్యపోకండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీకెన్ని గుండెలు.. ఇదేం ప్రశ్న అని ఆశ్చర్యపోకండి. డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ఈ ప్రశ్న వేయక తప్పదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి హార్ట్ ట్రాన్స్‌ప్లానేషన్ చేయకుండా మరో గుండెను అమర్చాలని వైద్యులు భావిస్తున్నారు. మొదటి గుండె ఉండగానే రెండో గుండె ఎక్కడ అమరుస్తారని మీకు అనుమానం రావొచ్చు. దీనికి వైద్యులు ఓ ప్లేస్ ఫిక్స్ చేశారులెండి. పొత్తి కడుపులో.. రెండో గుండెను అమర్చాలని నిర్ణయించారు.  వినడానికి తేలిగ్గా ఉన్నా.. సాధ్యమేనా.. అని అనిపించొచ్చు.

చెన్నై ఫ్రాంటియర్‌ లైఫ్‌లైన్‌ హాస్పిటల్‌కు చెందిన వైద్యుల బృందం.. రెండు శునకాల పొత్తికడుపులో మరో రెండు కుక్కల నుంచి సేకరించిన గుండెలను అమర్చింది. రెండో గుండె రక్తనాళాలను మొదటి గుండె రక్తనాళాలతో జత చేశారు. ఆపరేషన్‌ తర్వాత పరిశీలించగా.. మొదటి గుండెకు అది సహాయకారిగా పనిచేస్తున్నట్లు వారు గుర్తించారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పనిచేసినట్లు పరీక్షల్లో గుర్తించామని డాక్టర్‌ మధు శంకర్‌ తెలిపారు.

గుండె బలహీనంగా ఉన్న రోగులు చాలా మంది హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌కు అంగీకరించరు. ఇతర అవయవాలు దెబ్బతింటాయనో.. ఇతరత్రా ఆరోగ్య ఇబ్బందులు వస్తాయనో భయపడతారు. ఇలాంటి వారికి ఒక మెకానికల్‌ పంప్‌ ఏర్పాటు చేసి రక్తం సరఫరా అయ్యేలా చూస్తారు. ఇది చాలా రిస్క్‌, ఖర్చుతో కూడుకున్న పని. అందుకే పొత్తికడుపులో మరో గుండెను జత కలిపి రోగి కోలుకునే వరకూ చికిత్స  చేయాలని వైద్యులు భావిస్తున్నారు.

First published: August 9, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...