Health Tips : పిల్లలు తాగే పాలల్లో ఎనర్జీ పౌడర్స్ కలుపుతున్నారా.. అలా చేయకండి..

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటివారిచేత పాలు తాగించడానికి చాలామంది తల్లులు పాలల్లో చాక్లెట్ పౌడర్ కలిపిస్తుంటారు. దీంతో.. ఏం జరుగుతుందో చెబుతున్న ఫేమస్ ట్రైనర్ రుజుత.

  • Share this:
పాలు బలమైన పోషకాహారం. వీటిని పిల్లల చేత తాగించాలంటే తల్లులకి పెద్ద పనే. వారిచేత పాలు తాగించేందుకు ఎన్నో పాట్లు పడతారు. అయినా పిల్లలు పాలు చూడగానే పారిపోతారు. దీంతో.. మార్కెట్లో దొరికే రకరకాల పౌడర్స్‌ని పాలల్లో కలిపి ఇస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలు పాలు తాగుతారని ఆశ.
అయితే, పిల్లలు తాగే పాలల్లో ఇలాంటి ఫ్లేవర్స్ కలపడం వల్ల ఏం ప్రయోజనం ఉండదని చెబుతోంది ఫేమస్ ఫిట్‌నెస్ ట్రైనర్ రుజుత. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌కి ట్రైనర్గా చేస్తున్న ఈమె.. నోట్స్ ఫర్ హెల్దీ కిడ్స్ అనే పుస్తకం రాశారు. అందులో పిల్లలు పాలు తాగడం అనే అంశంపై ఈ విధంగా స్పందించింది. ఇలాంటి పౌడర్స్ కలపడం వల్ల ఆరోగ్యం కంటే అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చిన్నారులు లావైపోతారని నిపుణులు చెబుతున్నట్లు తెలిపింది.

పాలు తాగకపోయినాపర్లేదు.. చిన్నారులకి సీజనల్ ఫుడ్, నువ్వుల చిక్కీలు, శనగపిండి లడ్డు, రాగి పాయసం వంటి ఆహారాన్ని కాల్షియాన్ని భర్తీ చేయొచ్చని చెబుతున్నారు. అంతేకాదు. నాన్ డెయిరీ మిల్క్ కొనేటప్పుడు.. అందులో విటమిన్స్, ఖనిజాలు ఉన్నాయో లేదో తెలుసుకుని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.


అంతేకానీ, బలవంతంగా పాలు తాగించాల్సిన అవసరం లేదని ఆమె చెబుతున్నారు.

ఈ వీడియో కూడా చూడండి..

First published: