Health Tips : హెడ్‌సెట్ ఎక్కువగా వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది మ్యూజిక్ వినడం కామన్.. అదే విధంగా చాలామంది బిజీ షెడ్యూల్‌ వల్ల హెడ్‌ఫోన్స్, వాడుతూనే ఉంటారు.. అయితే.. తాజాగా తేలిన విషయమేంటంటే.. ఇలాచేయడం వల్ల భవిష్యత్‌లో చాలా సమస్యలు వస్తాయట.. అవేంటంటే..

  • Share this:
చాలామందికి హెడ్‌ఫోన్స్‌లో పాటలు వినడం ఇష్టం. కొంతమంది జర్నీ ఆ సమయంలో ఇవి లేకుండా వెళ్లనే వెళ్లరు.. దీని వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నాయి పరిశోధనలు. 15నిమిషాలకు మించి ఎక్కువగా వినడం వల్ల త్వరగా చెవుడు వస్తుందట. కాస్తాంత బ్రేక్ ఇచ్చి మళ్లీ వినడం వల్ల సమస్య కొంతవరకూ తగ్గుతుందని చెబుతున్నారు.

అంతేకాదు, మనం జర్నీస్, డ్రైవింగ్స్‌లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్తుంటాం.. ఇలా ఉన్నప్పుడు మిగతా విషయాలు మనం త్వరగా గ్రహించలేమని చెబుతున్నారు. దీనిద్వారా మెదడు గ్రహించే శక్తి మందగిస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనే రోడ్డుప్రమాదాలు జరుగుతాయని చెబుతున్నారు.


పెద్ద పెద్ద శబ్ధాలు విన్నప్పుడు మన చెవిలోపలి కణాలు దెబ్బతింటాయని.. వీటికి ఎలాంటి చికిత్స, పరిష్కారం ఉండదని ఇండియన్‌ నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ చెబుతోంది. కాబట్టి ముందునుంచే జాగ్రత్త పడడం అవసరమని చెబుతున్నారు.
First published: