Sneezing: కళ్లు తెరిచి తుమ్మితే కనుగుడ్లు బయటకు వస్తాయా.. పరిశోధనలో ఏం తేలింది..

ప్రతీకాత్మక చిత్రం

Sneezing: కళ్లు తెరిచి తుమ్మితే కను గుడ్లు బయటకు వస్తాయని చాలామంది అంటుంటారు. అందుకే మనం తుమ్మే సమయంలో ఆటోమేటిగ్ గా కళ్లు మూసుకొని తుమ్ముతాం. అయితే కళ్లు తెరిచి తుమ్మితే కనుగుడ్లు బయటకు వస్తాయా.. ఇందులో ఎంత నిజం ఉంది.. ఇప్పుడు తెలుసుకుందాం..

 • Share this:
  కళ్లు(Eyes) తెరిచి తుమ్మితే కను గుడ్లు బయటకు వస్తాయని చాలామంది అంటుంటారు. అందుకే మనం తుమ్మే(Sneezing) సమయంలో ఆటోమేటిగ్ గా కళ్లు(Eyes) మూసుకొని తుమ్ముతాం. అయితే కళ్లు తెరిచి తుమ్మితే కనుగుడ్లు బయటకు వస్తాయో.. రావో తెలుసుకునే ముందు.. అసలు తుమ్ములు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం.. కొందరికి జలుబు వలన తుమ్ములు వస్తుంటాయి. మరికొందరికి బయటి పదార్థాలు ముక్కు రంధ్రాలలోనికి వెళ్లినపుడు ముక్కు జిలపెడుతుంది. తుమ్ము వచ్చినప్పుడు కడుపు, రొమ్ము, డయాఫ్రమ్, స్వరపేటిక, గొంతు వెనుకభాగం, కళ్ళు ఇవన్నీ పనిచేస్తాయి.

  Height Growth Tips: పొట్టిగా ఉన్నారని బాధపడుతున్నారా.. అయితే వీటిని పాటిస్తూ ఎత్తు పెరగండి..


  ఇవన్నీ కలిసి బయటి నుండి శరీరం లోనికి వెళ్లిన పదార్థాలను తుమ్ము ద్వారా బయటకు పంపుతాయి. అయితే కొంతమందికి ఆగకుండా కంటిన్యూస్ గా 10 తుమ్ములను తుమ్ముతారు. దానికి కారణం ఏంటంటే.. ఏదైతే మన ముక్కులోకి వ్యర్థ పదర్థాలు వెళ్లాయో అవి.. ఒక్క తుమ్ముతో బటయకు రావచ్చు.. లేదా రాకపోవచ్చు. ఒక వేళ రాలేదు అంటే మాత్రం.. వరుస పెట్టి తుమ్ములు వస్తునే ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తుమ్మేటప్పుడు కళ్లు మూసుకోకపోతే ఏమవుతుంది.. నిజంగానే కను గుడ్లు బయటకు వస్తాయా.. అందులో నిజమెంత..దీని గురించి తెలుసుకుందాం..

  Remove Lizards From Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..


  ఎవరైనా తుమ్మినప్పుడు ఓ నాడి మెదడుకు సిగ్నల్ పంపడంతో.. ఆటోమేటిక్ గా కళ్లు మూసుకుంటాం అని ఓ పరిశోధనలో తేలింది. అయితే అలా కళ్లు మూసుకోవడం మంచిదేనట.. ఎందుకంటే తుమ్మినప్పుడు ముక్కు నుంచి వచ్చే బ్యాక్టీరియా , వైరస్ లు కళ్లలోకి వెళ్లకుండా ఉంటాయట.. అందుకే తుమ్మినప్పుడు మనం కచ్చితంగా కళ్లు మూసుకుంటామట.. అయితే దాదాపుగా చాలా తక్కువ మంది మాత్రమే కళ్లు తెరిచి తుమ్మగలరు. కళ్లకు, ముక్కుకు డైరెక్ట్ గా సంబంధం ఉండదని పరిశోధకులు గుర్తించారు. తమ్ము ఎంత వేగంగా వచ్చినా కళ్లు మాత్రం బయట పడవు.

  Weight Loss Tips : త్వరగా బరువు తగ్గాలా.. అయితే ఈ 6 మర్పులు చేయండి..


  ఎందుకంటే.. కళ్లు ఆరు రకాల ఎక్స్ ట్రా ఓక్యూలర్ కండరాలతో నిర్మాణమవుతాయి. కళ్లు వాటి స్థానంలో చాలా గట్టిగా.. ధృడంగా పాతుకుని ఉంటాయి. అంత సింపుల్ గా బయటకు రాడానికి అవకాశం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే.. తుమ్మే సమయంలో ఎంత తెరిచి ఉంచినా కచ్చితంగా మనం కళ్లు ఆటోమేటిక్ గా మెదడు ఆదేశానుసారం మూసుకుపోతాయని పరిశోధనల్లో తేలింది. జలుబు అనేది సాధారణంగా వారం లేదా పది రోజుల వరకు ఉంటుంది. కొంతమంది మెడిసిన్ తీసుకున్నా జలుబు తగ్గకపోవచ్చు.

  Daily Walking Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నడకలో ఇలాంటి మార్పులు చేయండి.. వివరాలు తెలుసుకోండి..


  కానీ వారం రోజుల తర్వాత మన శరీరంలోకి వెళ్లిన రెట్రో వైరస్ ఆటోమెటిక్ గా బయటకు వస్తుంది. అయితే తుమ్మే టప్పుడు ఏదైనా రూమాలు అడ్డం పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే.. ఆ తుప్పెర్లు ఎదుటి వారిపై పడిందంటే.. వాళ్లకు ఈ వైరస్ అంటుకుంటుంది. జలుబు అనేది అంటు వ్యాధి అన్న విషయం అందరికీ తెలిసిందే.
  Published by:Veera Babu
  First published: