Diwali 2020 : వెలుగుల పండుగ దీపావళి. ఈ సంవత్సరం నవంబర్ 14 న ఈ పండుగను జరుపుకుంటున్నారు. దోపావళి నాడు తమ ఆర్థిక సమస్యలన్నీ తీరి... తమను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే... కొన్ని పనులు చేయడం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందవచ్చని పండితులు అంటున్నారు. అవేంటంటే.. దీపావళి పండుగ రోజున ఉదయాన్నే నువ్వుల నూనెను తలకి, శరీరానికి రాసి... కాసేపు మర్దన చెయ్యాలి. ఎలా అంటే ఆ నూనెంతా మన శరీరం గ్రహించాలి. ఆ తర్వాత కుంకుడుకాయ, సున్నిపిండితో అభ్యంగన స్నానం చేసి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే నరకబాధల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
కేవలం ఇది ఆచారమే కాదు.. శాస్త్రపరంగా కూడా మనకి మేలు జరుగుతుందని తేలింది. శరీరాన్ని, జుట్టుని సంరక్షించడంలో నువ్వులనూనె అమోఘంగా పనిచేస్తుంది.. అదేవిధంగా.. కీళ్ళనొప్పులకి మందుగా కూడా నూనెని ఉపయోగించొచ్చు. కాబట్టి.. రెండు విధాలుగా మేలుచేసే ఈ పనిని మీరు కూడా ఆచరించమని సూచిస్తున్నారు పండితులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diwali 2020, Health Tips, Tips For Women